వికృతమైన చెట్టు; - సి. హెచ్.ప్రతాప్
 మనుష్యులు,జంతువులు, పక్షుల లాగే చేట్లకు కూడా ప్రాణం వుంటుందని ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బొస్ తన అద్భుతమైన పరిశోధనల ద్వారా రుజువు చేసారు. ప్రాణం వున్న చెట్లు మానవులలాగే ఆలోచించడం మొదలుపెడితే ఎలా వుంటుంది అన్న ఊహ నుండి ఈ కధ పుట్టింది.
చాలా కాలం క్రితం, ఒక దట్టమైన అడవిలో కొలది ఎత్తన ,  అందమైన చెట్లు వుండేవి. ఒక  సంవత్సరం నుండి వందల సంవత్సరాల వయస్సు వున్న ఆ చెట్లతో ఆ అటవీ ప్రాంతం ఎంతో అద్భుతం గా వుండేది. వేల పక్షులు ఆ చెట్లపై గూడు కట్టుకొని నివసిస్తూవుండేవి. చెట్ల మొదట్లో వున్న సారవంతమైన మట్టిలో లక్షల సూక్ష్మజీవులు వుండేవి. జీవ వైవిధ్యానికి ఆ అడవి ఒక ప్రతీకలా వుండేది..  ఆ చెట్ల మధ్య ఒక వికృతమైన చెట్టు వుండేది. దాని కొమ్మలు అష్ట వంకరలతో వుండేవి. దాని మూలాలకు అసమాన వక్రతలు ఉన్నాయి దాని దురదృష్టవశాత్తు దానికి ఏదో రోగం అంటుకుంది. దాని వలన దాని కొమ్మలన్ని పుచ్చిపోసాగాయి. ఆకులు నీలం మరియు నలుపు రంగులోకి మారిపోసాగాయి. అదొకరకమైన దుర్ఘంధం ఆ చెట్టు నుండి వస్తుండేది. దాని ఖర్మ కొద్దీ ఒక్క పక్షి కూడా గూడు కట్టుకొని దాని మీద నివసించేది కాదు.
ఆచెట్టు అవస్థలను చూసి మిగితా అందమైన చెట్లు దానిని గేలిచెయ్యసాగాయి. తమ అంద చందాలను పొగుడుకుంటూ, ఆ వికృతమైన చెట్టు యొక్క దురవస్థను విమర్శిస్తూ ఆనందించసాగాయి.. ఆ చెట్టుకు వికృతచెట్టు అని పేరు పెట్టి దాని అసాధారణలతను చిలవలు పలవలు చేసి వఋనించి ఆనందించేవి. అందరూ పిలవ డం వలన ఆ చెట్టుకు వికృతచెట్టు అనే మారుపేరు స్థిరపడిపోయింది.
 కానీ, ఆ చెట్టు ఎప్పుడూ తిరిగి విమర్శించేది కాదు.. పైపెచ్చు ఆ వికారమైన చెట్టు ఇలా అనుకునేది, “నేను ఇతర చెట్లలా అందంగా ఉంటే బాగుండేది. దేవుడు నాకే ఎందుకు ఇలా చేసాడు? ప్రయాణీకులకు నేను నీడను ఇవ్వలేను, పక్షులు నాపై గూళ్లు కట్టుకోలేను. నా అవసరం ఎవరికీ లేదు. నాకు అంంతు తెలియని రోగం వచ్చినా మందిచ్చేచారే లేరు. నా లాంటి దురదృష్తం ఇంక ఎవ్వరికీ పట్టకూడదు. "
అయితే ఆ చెట్ల మధ్యనే వున్న ఒక ముసలి చెట్టుకు మిగితా చెట్ల పద్ధతి నచ్చేది కాదు." భగవంతుడు అందరినీ ఒకేలా సృష్టించడు. వారి వారి పూర్వ జన్మ సుకృతం బట్టి అందచందాలు, భోగభాగ్యాలు, సుఖ దుఖాలను ప్రసాదిస్తాడు. అయితే తాను సృష్టించిన తన బిడ్డల పట్ల తనకెలాంటి వివక్షత వుందదు. ఆయనకు లేని వివక్షత మీకెందుకు ? దయచేసి ఆ వికృత చెట్టును మీ కుటుంబంలోని వారిలాగా ఆదరించండి. స్నేహ బాంధ్యవ్యాలు పెంచుకోండి" అని వాటికి హితవు చెప్పేది.
వికృతమైన చెట్టుకు కూడా స్వంతన చేకూరేలా మంచి మాటలు చెప్పేది.
ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవికి వచ్చాడు. అక్కడి చెట్లను పరిశీలించి, “ఈ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. నేను వాటిని నరికివేయాలి. వీటన్నిటినీ నరికివేసి, దుంగలను పట్నం తీసుకెళ్ళి అమ్ముకుంటే బోల్డంత డబ్బు వస్తుంది. ఇక నా కుటుంబానికి జరుగుబాటుకు ఎలాంటి కొరత వుండదు" కట్టెలు కొట్టేవాడు ముందుగా అందంగా నిగనిగలాడుతున్న చెట్లను ఎంచుకున్నాడు.  తన గొడ్డలిని తీయగానే చెట్లు భయపడిపోయాయి
అతని గొడ్డలి పదునుకు ఒక్కొక్క చెట్టే నేలకూలసాగింది. ఆ గొడ్డలి దెబ్బలకు తాళలేక చెట్లు అబ్బా, అమ్మా అంటూ హాహాకారాలు చేయసాగాయి.
ఇంతలో, కట్టెలు కొట్టేవాడు వికారమైన చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు  అకస్మాత్తుగా తన గొడ్డలిని ఎత్తాడు, ఆ వికారమైన చెట్టు ఎంత వంకరగా ఉందో గమనించాడు. “ప్చ్! ఈ వంకర చెట్టు నాకు పనికిరాదనిపిస్తోంది. దీనితో నాకు పనికి వచ్చే దుంగలు తయారు చెయ్యలేము” అని దానిని వదిలేసి ఇంకొక చెట్టు దగ్గరకు పోయాడు. కట్టెలు కొట్టేవాడు ముసలి చెట్టును కూడా పరీక్షించి ఇది ఎందుకూ పనికిరాదని తేల్చి దానిని కుడా వదిలేసాడు.
"చూసావా, నీకు వికృత రూపం, నాకు వృద్ధాప్యం వరాలుగా మారాయి. తాము అందమైనవాళ్ళమని గొప్పలు చెప్పుకున్న మిగితా చెట్లు ఆ కట్టెలు కొట్టేవాడి  ఆయుధానికి బలైపోయాయి. ఇప్పటికైనా భగవంతుని సృష్టిలోని అంతరార్ధం గ్రహించావా ?" అన్న ముసలి చెట్టు మాటలు వికృత చెట్టుకు బాగా అర్ధం అయ్యాయి.
 ఆ వికారమైన చెట్టు ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. తనను వికృతంగా చేయడం ద్వారా దేవుడు తనకు నిజంగా ఒక వరం ఇచ్చాడని ఆ చెట్టు  గ్రహించింది..
ఆ చెట్టు కట్టెలు కొట్టేవాడి గొడ్డలి నుండి తప్పించుకోవడం చూసిన మిగితా చెట్లకు జ్ఞానోదయం అయ్యింది.భగవంతుడు తన సృష్టిలో ప్రతీ జీవి లేదా చెట్టును ఏదో ఒక ప్రత్యేకతతో సృష్టిస్తాడని, పనికి రానిదంటూ ఏమీ వుండదని, ప్రస్తుత కధలో ఆ వికృతమైన చెట్టును అలా సృష్టించడం వలనే  ఆ కట్టెలు కొట్టేవాడ్ది బారి నుండి తప్పించుకోగలిగిందని, తామందరం అందమైన వాటిగా గొప్పలు చెప్పుకున్నా చివరకు ఆ కట్టెల వాడికి బలయ్యామని అర్ధం చేసుకున్నాయి.
కొలది కాలం లోనే ఆ వికృతమైన చెట్టు సంపూర్ణమైన ఆరోగ్యం సంతరించుకొని ఆనందం గా ఉండసాగింది.
.సి హెచ్ ప్రతాప్ 


MOBILE no : 91368 27102 

కామెంట్‌లు