నా నీడ ;-ఎం. వి. ఉమాదేవి
 నేను ఒంటరినని విషాదంలో 
మునుగుతున్నా.. ఈ వనంలో 
ప్రశాంతంగా ఉంది ప్రకృతి పలకరింపు... 
ఆకలికి సొంత వేటలో ఆహారo 
కానీ.. నా వాళ్ళు ఎక్కడ? 
గోళ్ళూ చర్మం జాడలున్నాయి 
గోడుగోడుమన్న ప్రాణం శబ్దం 
సాకీ ఆత్మ గాలిలో గిరికీలు.. 
గంభీర సౌందర్యం శాపమా? 
భువనాన్ని తాకే భవనాలడిగామా? 
భూమిలో హక్కులు మింగేశామా? 
ప్రతిబింబమే మిగిలే అదైనానిల్చేనో లేదో !? 

కామెంట్‌లు