గురువుకు వందనం (వచన గేయం )-;-ఎం. వి. ఉమాదేవి
ఆజ్ఞాపించిన ఆయన హృదయం 
సుజ్ఞానానికి నవోదయం 
ఆశీస్సులిడిన అమృత భావం 
ఆ గురువు మేధ పంచే సమయం!!

కల్మషయోచన కడిగే వర్షం 
మన అభివృద్ధికి తనలో హర్షం 
గురువుకు వందనం నేడు 
పున్నమి కాంతులు వెలుగులరేడు !!


కామెంట్‌లు