సునంద భాషితం ; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఇవ్వగలం... చెయ్యగలం.. 
  *****
"చాలా మంది ...మేం ఏదైనా ఇవ్వగలిగే అంత ధనవంతులం కాదూ, ఏమైనా సాయం చెయ్యగలిగినంత బలవంతులమూ కాదు." మా దగ్గర ఏముంది అని నిర్లిప్తంగా పెదవి విరుస్తూ ఉంటారు.
అవే వారిని వెంటాడే అపోహలుగా చెప్పవచ్చు.
ఇవ్వాలనే మనసుంటే,చేయ్యాలనే సంకల్పం ఉంటే 
ఆస్తి అంతస్తు, కండబలం, శారీరక ధారుడ్యం ఏమీ అవసరం లేవు. అడ్డుకావు.
ఆప్యాయత పంచే మనసు. సాయం చేసే గుణం..ఈ రెండూ ఉంటే చాలు.
మనిషికి మనిషికి మధ్య మానవీయ విలువల అవసరాలు ఉంటాయి.
మన చుట్టూ ఉన్న వారిలో  మానసిక, శారీరక అనారోగ్యంతో బాధ పడుతూ.. ఆప్యాయత, గౌరవం  మొదలైన వాటికై తపించే వాళ్ళు ఉంటారు.
వీటిలోవి ఏ కొంచెం  మనం ఇవ్వగలిగినా  వాళ్ళకు ఆనందం  మనకు తృప్తి కలుగుతుంది.
అలాగే స్వయంగా పనులు చేసుకోలేని వారు కొందరు ఉంటారు.
 అలాంటి వారికి కొంచెం మాట,చేత సాయం చేస్తే  వారికి మన పట్ల కృతజ్ఞతా భావన కలుగుతుంది.
 నేను సైతం సాయం చెయ్యగలను అనే  నమ్మకం మనలో పెరుగుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు