చిరంజీవి సినారె;---కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి
 పాల మీగడ మాటలతో
తేనె తేటల పాటలతో
విశ్వం అంబర అంచులను
చవి చూపించిన మహా కవి
పద్యం ,గద్యం ,గజల్స్ లత


పాఠక లోకాన్ని ఉర్రూతలూగించిన
సాహితీ మాంత్రికుడు
తెలుగు దనం ఉట్టి పడే పంచెకట్టుతో
ఉపన్యాసంతో కనికట్టు చేసిన
క్రొత్త తరం కవులకు మార్గదర్శి
ఎవరన్నారయ్యా..? ఆయన లేరని
ప్రకృతి సోయగంలో...
పదహారణాల ఆడపడుచు కలలో
తెలుగువాడి పంచె కట్టులో
తెలుగు భాష కంచు కంఠంలో
మన మద్యే ...మన ముందే
జీవించి ఉన్న చిరంజీవి సినారె

 
కామెంట్‌లు