బహుమతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు క్లాసులో టీచర్ కి తమ ఇంట్లో పూసిన చిన్న గులాబీ తెచ్చి ఇచ్చింది హ్యాపీ!స్మిత  బంతిపువ్వు ఇచ్చింది.ఆరెంటినీ ఆప్యాయంగా తీసుకుని తల్లో పెట్టుకుంది టీచర్! ఆమర్నాడు మల్లెల మాల తెచ్చి టీచర్ కి ఇచ్చింది మాలతి."చూడు తల్లీ!నీవు డబ్బు పెట్టి కొని తేవద్దు.బాగా చదివి అన్ని సబ్జెక్టుల్లో పాసవ్వాలి."టీచర్ మాటలకి మొహం ముడిచింది మాలతి.ఆపిల్ల సరిగా చదవదు.అన్నిట్లో ఒక అంకె మార్కులే! మొండి  గారాబం!పూలు ఇస్తే టీచర్ మనసు లో  ఆనందించి మార్కులు వేస్తుంది అనే అపోహ  అహంకారం ఆపిల్ల సొత్తు. పక్కపిల్లలతో కొట్లాడుతుంది.హోం వర్క్ చేయదు.ఇప్పుడు తను స్ట్రిక్ట్ గా లేలేక పోతే రేపు టెన్త్ గట్టెక్కటం కష్టం! అందుకే  టీచర్ ఓకథ చెప్పింది"మనం బహుమతి వలన ఆమనిషి మంచితనం గుణగణాలను అంచనా వేయలేము.వారి మనసు ప్రేమ ఆప్యాయత ముఖ్యం! ఒక సాధువు దగ్గర  ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒకడు మందబుద్ధి!చెప్పింది త్వరగా  అర్ధం చేసుకోలేడు.కానీ  మంచి మనసు! భక్తి వినయాలు పుష్కలంగా ఉన్నాయి కానీ  మంచి చెడు తెలీదు. నేలపై రాలిన పళ్ళు  దగ్గరగా ఉన్న బావిలోని ఉప్పగా ఉన్న నీరు తెచ్చి గురువుగారి దగ్గర పెట్టేవాడు. రెండో శిష్యుడు మహా చురుకు!మంచి ఫలాలు తీయటి నీరు తెచ్చేవాడు.కాస్త  అహంకారం గూడా ఉంది. ఇద్దరివీ సాధువు సమానంగానే స్వీకరించేవాడు.ఆరోజు  చురుకు తెలివిగల శిష్యుడికి  బాగా జ్వరంవచ్చింది.నాలుక పిడచకట్టుకుని పోతోంది. "శివా!దాహం దాహం!" అతని అరుపుతో శివా  తను గురువు కోసం తెచ్చిన చెంబు లోని నీరు అతనికి ఇచ్చాడు.బాబోయ్!ఉప్పు కషాయం! కానీ రెండు గుటకలు వేశాడు.ప్రాణం కాస్త లేచి వచ్చింది. కానీ  వాంతి వచ్చేలా ఉందని బైటకి పరుగెత్తాడు.వాడు కోలుకున్న తర్వాత  సాధువుతో"గురూజీ!ఆఉప్పు నీటిని మీరు ఎలా తాగగలుగుతున్నారు?ఆపళ్లు కూడా రుచి పచి లేవు". దానికి ఆసాధువు ఇలా జవాబిచ్చాడు "నాయనా!నీవు వస్తువు రుచి ఆకారం  చూస్తున్నావు.నేను పవిత్రమైన  శివా అంతరంగాన్ని వాడిప్రేమ ఆప్యాయతలను చూస్తాను. వాడి మనసు నిష్కల్మషం!మధురం!"అంతే ఆగర్విష్ఠి శిష్యుడి అహం అణిగింది🌷
కామెంట్‌లు