సుప్రభాత కవిత ;-బృంద
గగనపు నుదుట బొట్టులా
సూరీడు

ముత్తెదువ చెంప పై పసుపులా 
రంగు పూసుకున్న నింగి

అంబరమంతా పండగంటి
సంబరం

బంగరు వెలుగున 
నిండుగ తడిసే గిరులు.

ఊగేపచ్చని ఆకులు  
పుడమి గుమ్మాన కట్టిన తోరణాలు

వాడిపోని వెలుగు  రేఖల
జిలుగులు తాకిన ప్రకృతి 

ఎదురు చూచు కన్నుల
నింపే సంతోషాలు.

ప్రతిరోజూ  అద్భుతమే!
ప్రతి ఉదయం ఒక వరమే!

మది ముంగిట శుభస్కరంగా
మంగళ వాద్యాలు  మోగించే
పండుగ లాటి ఉదయానికి

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు