ఆరోగ్యం!!?; -సునీతాప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
ఆరోగ్యము అంటే
శక్తివంతమైన శరీరం
శక్తివంతమైన మనసు అని అర్థం!!?

మనసుతో
శరీరాన్ని శక్తివంతం చేయొచ్చు
శరీరంతో
మనసును శక్తివంతం చేయొచ్చు!!!?
ఆలోచనలతో
శరీరాన్ని దృఢంచెయ్యొచ్చు
ఆహారంతో
ఆలోచనలను మార్చవచ్చు!!?

ఆరోగ్యవంతమైన సానుకూల ఆలోచనలతో
సాధించవచ్చు
అనారోగ్యకరమైన అననుకుల ఆలోచనలతో-కృంగిపోవచ్చు కానీ
ఆరోగ్యకరమైన ఆలోచనలతో
శరీరాన్ని శక్తివంతం చేస్తాం!!

ఆలోచనలతోనే
ఆలోచనలను మారుస్తాం కానీ
ఆహారంతో కాదు ఆరోగ్యంతో కాదు
శక్తివంతమైన శరీరంతో కాదు!!?

శరీరం మనసును మార్చడంలో
మామూలు పాత్ర వహిస్తుంది
శరీరానికి మనసును మార్చే శక్తి లేదు!!
శరీరం శరీరాన్ని శక్తివంతం చేసుకుంటుంది!!

అనారోగ్యం ఆలోచనలను మార్చలేదు
కానీ ఆలోచనలకు సహకరించదు!??

శక్తివంతమైన మెదడు కూడా
శరీరాంగమే కానీ
శరీరం శక్తివంతమైన
మనిషి మనస్తత్వాన్ని మార్చలేదు!!?

మనస్తత్వం శరీరాన్ని
శరీరం నొప్పిని అదిగమిస్తుంది
అదే శరీరతత్వం మనస్తత్వం!!?

ఏ పరిస్థితుల కైనా శీతోష్ణస్థితిలకైనా
అలవాటు పడితే 
శరీరమైన మనసు అయిన
అనుకూలంగా మారుతుంది!!?
శరీరం మనసు ప్రత్యేకత అది
అదే ఆరోగ్యం!!?

Sunita Pratap teacher palem nagarkurnool dist,,8309529273

కామెంట్‌లు