సునంద భాషితం ; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 చేట... చేటు... 
  ******
అప్పుడప్పుడూ మనసులో అనేకానేక   పనికి రాని ఆలోచనలు, వ్యతిరేక భావనలు ఉవ్వెత్తున వస్తుంటాయి.
 
ఒకోసారి నిరాశ నిస్పృహలు చుట్టు ముట్టి ,చేయాల్సిన పనులకు అడ్డుతగులుతుంటాయి.మనసును, మనిషిని స్థిమితంగా ఉండనీయవు.ముందుకు సాగనీయవు.
ఇలాంటి వాటి వల్ల చేటు కలుగకుండా ఎప్పటికప్పుడు మనసు చేటతో చెరిగేసుకోవాలి.
అప్పుడే తాలు, పొల్లు భావనలు ఎగిరి పోయి అవసరమైనవి మాత్రమే మనసులో చేటలో మిగులుతాయి.
అలాగే వాటిని వదిలేస్తే బియ్యానికి పురుగు పట్టినట్టు మనసుకే కాదు, మనిషికీ ఇబ్బందిని,చేటును తెచ్చిపెడతాయని గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు