ఓ విషాదం;- అరుణ సందడి
నిర్లక్ష్యమెా నిగుాడమెా
అలసత్వమెా అన్యాయమెా
 చదరంగపు ఆటయెా
విలయమెా ప్రళయమెా..

విధిరాతనో విధాతగీతనో
భక్తులంటేనే చిన్నచుాపో
ప్రమాదాల బాటలో
పడిముంచే వరదలో...

ఊహించనిరీతిలో
జలసమాధినే చేస్తివే
జగాన నమ్మకాన్నే తోస్తివే
ప్రకృతి ప్రకోపమై ఉరుములంటుా..

 ఉసురోసుకొన్న ఉప్పెనయై
పెళపెళకుాలిన శిలలంటుా
కొట్టుకుపోయిన మనుషులే
 సాక్షమంటుా
ఆహ్లాదంలో అపశృతియై
విశ్రాంతి స్థలమే విఘాతమై...

భక్తికి లభియించిన వరమై
వరదైముంచావు మృత్యువైకమ్మావు
కించిత్తు దయలేని దైవమా
పగఏలనో ప్రతీకారమేలనో...

రక్కసిరుాపులెన్నో
జల్సాగా బ్రతికే జీవాలెన్నో
నోకరినోకరు చంపేస్తుా
ఆడబిడ్డల ఉసురోసుకొంటుా...

జగాన తిరుగుతున్నా
మనసులేని మృగాలెన్నో
ఇచ్చేస్తున్నావు ఆయుష్షు 
భుామికి బరువైనా...

తీసేస్తున్నావు  ప్రాణం
 నమ్మినవాడి కర్మఫలమై
ఇదెక్కడి ధర్మమెా
ఇదెక్కడి దయనో..

సజీవసమాధై విషాదమే
విలయమై విలాపమై
పరికించినా అర్ధం కానీ మాయై
చిత్రవిచిత్రాల మలుపులై....

చావైనా బ్రతుకైనా 
నీ శాసనమంటుా
విధిస్తున్నావు శిక్ష
లిఖిస్తున్నావు కన్నీటిపరీక్ష
నిమిత్తమాత్రులం నిజానికి నీబిడ్డలం...
నీకిది న్యాయమా ఓ దైవమా!

            =============================

అమర్నాథ్ యాత్రలో మరణించివారి ఆత్మశాంతికలగాలని ప్రార్ధిస్తుా🙏

కామెంట్‌లు