సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
  సంపద... సంస్కారం
    *****
బతకడానికి జీవనాధారం సంపద. బతుకు దీపమై వెలుగు పంచడానికి  కావాలి సంస్కారం.
సంపద సంస్కారానికి శోభనిచ్చే  విలువల ఆభరణం  అయితేనే సమాజంలో  గౌరవానికి, సంస్కారానికి ప్రతీకగా వ్యక్తిత్వం నిలుస్తుంది.
సంపదే ధ్యేయంగా విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తే...సంస్కారం మనిషిలో ఎండమావే అవుతుంది.
సంపద  సంతోషాన్ని పెంచుతుందని నమ్మేవారు సంపాదన వెంట నీడలా పరుగులు తీస్తారు.
వెలుగులో తప్ప వెంటరాని నీడను తలుచుకుని ,వేదన చీకట్లో మగ్గడం కంటే...సంస్కారవంతమైన విలువలతో
సంతృప్తిగా జీవించడం మేలు కదా...!
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు