చూడమ్మా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిట్టి చిలకమ్మా - 
నీపలుకులు ఇవ్వమ్మా 
చక్కని నెమలమ్మా - 
నీ నాట్యం చూపమ్మా
నల్లని కోయిలమ్మా - 
నీపాట పాడమ్మా 
గువ్వ రావమ్మా - 
నీ గూడు ఏదమ్మా 
కోడి పెట్టమ్మా -  
నీగుడ్డు ఇవ్వమ్మా 
తెల్లని కొంగమ్మా - 
ఈ చేపలు పట్టమ్మా
పిరికి పిట్టమ్మా - 
ఈ గింజలు తినిపోమ్మా
పావురాయమ్మా - 
మా పాపను చూడమ్మా !!

కామెంట్‌లు