గురువే సర్వస్వం ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 త్రిమూర్తి రూపం 
ఇలనడిచే జ్ఞానసాగరం 
నిలువెత్తూ ధర్మనిలయo 
బతుకు విలువల విన్యాసాలను 
విడమరిచే జీవిత పాఠాలను 
నేర్పించే నిండు హృదయం 
కదిలేదీ కదిలించేదీ 
నిను దారిలో నడిపించేదీ 
దారిదీపమై వెలుగొందేదీ
జ్ఞానాంబుధిలో ముంచెత్తేదీ 
కోపంతో కరుణించేదీ 
శాపంతో వరమిచ్చేదీ 
మాటలు తేనెలు కురిపించేదీ 
పరబ్రహ్మమై దీవించేదీ
తన శిష్యుల కళ్ళల్లో
వెలుగుల తళుకుల కోసం 
తన జీవితాంతం పరిశ్రమించేదీ
తననోడించే అంతేవాసి కోసం
అహర్నిశలు పరితపించేదీ
ఆ గురువేకద మనకు సర్వం
దేవుడు కోపిస్తే గురువు కాపాడగలడు
గురువు కోపిస్తే ఆ దేవుడేమీ చేయలేడు
అందుకే…. 
గురువాజ్ఞ మీరకు
గురుసేవ మానకు !!

కామెంట్‌లు