సుప్రభాత కవిత ; -బృంద
పెరుగుతున్న కిరణాలు
పరుస్తున్న వెలుగులు

పరుగాపి చూస్తున్న కెరటాలు
పరుగులు తీస్తున్న సమీరాలు

మరుగవుతున్న తిమిరాలు
మెరుగులు  దిద్దుకున్న నీరదాలు

జారుతున్న కాలం తో
పోరుతున్న జీవితాలు

తీరుతున్న కోరికలు
చేరుకున్న తీరాలు

కోరుకున్న విజయాలు
చేరువైన గమ్యాలు

మారుతున్న విలువలూ
చేరుతున్న మార్పులూ

కురుస్తున్న  కరుణలకు
మురుస్తున్న మనసులతో

పల్లవించు ఉదయానికి
పులకరించి పలుకుతున్న

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు