సుప్రభాత కవిత ; -బృంద
కదిలిపోయే కాలానికి
అందరూ ఒక్కటే!

అవనిలోని అణువణువూ
కాలమహిమకు లొంగ వలసిందే!

ఎవరికి ఏ ఆనందాల మూటో!!
ఎవరికి ఏ  మమతల  లోటో!!
ఎవరికోసం పువ్వుల  బాటో!!
ఎవరికోసం ఏ ద్రోహపు కాటో!!

ఎపుడెవరికి ఏమిస్తుందో
ఎవరికీ తెలియదు.

కలతలని  కప్పేస్తూ
కన్నీళ్ళను  తుడిచేస్తూ
గాయాలను  ఓరుస్తూ

ఆశే ఆయుధంగా 
ఓర్పే ఔషధంగా

శుభాలు  కోరుతూ
అనుగ్రహం ఆశిస్తూ
కర్మ సాక్షికి  జోతలతో

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు