*"దాశరథీ శతకం " - కంచెర్ల గోపన్న
 *"దాశరథీ శతకం " - కంచెర్ల గోపన్న- తెలుగుజాతికి పరిచయం చేయనవసరం లేని పేరు - భక్తి మార్గంలో ఒక అద్వితీయమైన శక్తి - "భద్రాచల రామదాసు" అంటే త్వరగా గుర్తు పడతారేమో కదా!*
*తెలుగు రాష్ట్రాలలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని తరువాత అంతటి మహిమ, మనలను భక్తి పారవశ్యంలో ముంచిన దైవం భద్రాచల రామయ్య, నిస్సందేహంగా. నేలకొండపల్లి లో భద్రగిరి మీద వేలసి భక్తుల కొంగు బంగారమైనాడు, రామదాసు కు మోక్షమిచ్చాడు భద్రాచల రామయ్య.*
*కంచెర్ల గోపన్న చిన్నతనం లోనే బాల రామాయణం చదివి, ఆకళింపు చేసుకుని రామ భక్తి లో ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ కంచెర్ల గోపన్న ప్రధమశాఖ నియోగి బ్రాహ్మణుడు. రుగ్వేదాధ్యాయి. రఘునాథభట్టార్ అనే పెద్దాయన మన గోపన్న కు దీక్ష ఇచ్చి వైష్ణవాన్ని పరిచయం చేసారు. పుట్టుకతో మహమ్మదీయుడు అయినా రామభక్తుడు అయిన కబీరు దాసు, మన గోపన్న కు "రామ తారక మంత్రము" ఇచ్చారు. ఉప్పొంగిపోయిన మనసు తో "తారకమంత్రము కోరిన దొరికేను ధన్యడనైతిని, ఓ రన్నా!" అని ఆ రాముని మీద ఎన్నో భక్తి కీర్తనలు రాసాడు.*
*కంచెర్ల గోపన్న అదేనండీ! మన భద్రాచల రామదాసు కీర్తనలు తెలియని, వినని, పాడుకోని తెలుగువారు ఈనాడు, ఆనాడు కూడా ఎవరు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గొంతులో ఈ కీర్తనలు వింటుంటే, రామదాసు కీర్తనలు పాడడానికే బాలమురళీకృష్ణ జన్మించారేమో అని అనుకోని తెలుగువారు వుండరు. ఇప్పుడంటే నాగరికత పేరుతో పట్టణాలలో వుంటూ మనం మన ఇళ్ళ ముందరికి వచ్చే దాసరులను మర్చే పోయాము. వీళ్ళు, నడుముకు పట్టుబట్ట కట్టి, చేతిలో ఇత్తడి చిరుతలు పట్టుకుని, నెమలికుంచెతో సెమ్మెలతో, నృత్యం చేస్తూ రామదాసు కీర్తనలు పాడుతూ వస్తుంటే భగంతుడే మన ముందు నుల్చున్నంత ఆనందం కలిగేది.*
*"దాశరధీ శతకం" తెలుగులో వున్న శతకాలలో ఎన్న దగినది. కవి లోని ఆర్తి, భక్తి భావం ప్రతీ పద్యం లోను మనకు పరిచయం అవుతుంది. ఈ శతకంలో, గొపన్న అనుభూతి అక్షర రూపంలో మనకు కనిపిస్తుంది.*
*శ్రీరాముని నమ్ముకుని తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్న వారు బమ్మెర పోతనామాత్యడు, కంచెర్ల గోపన్న అనబడే భద్రాచల రామదాసు. ఇద్దరి కవిత్వంలో నిండిన రామభక్తి, తెలుగు వారిని భక్తి సముద్రంలో ఓలలాడించింది.*
*గురు కృపతో, పరమేశ్వర అనుగ్రహం తో, ఆంజనేయుని సహకారంతో, "దాశరధీ శతకము " చదువుకుంటూ, మరొక్కసారి ఆ భక్తి పారవశ్యంలో మునిగి తేలే ప్రయత్నం మనస్పూర్తిగా మనమందరం చేద్దాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు