ఆనాటి మేటినటుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రెండు తరాల క్రితం వారికి  తెల్సిన మహానటుడు వేమూరి గగ్గయ్య!పౌరాణిక దుష్ట రాక్షస పాత్రలకు పెట్టింది పేరు. ఆనాటి గుంటూరు జిల్లా వేమూరు లో పుట్టారు. తండ్రి గ్రామ కరణం! ఈయనకూడా పరీక్షపాసై కరణం ఉద్యోగం చేసి ఆపై నాటకాలపై మక్కువ తో సురభి నాటక సమాజం తో కలిసి రంగూన్ (నేటి మయన్మార్) వెళ్లి 6నెలలు అక్కడ నాటకాలు వేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. మైలవరం కంపెనీ లో చేరి మైకులులేని ఆరోజుల్లో తన కంచుకంఠంతో ఓమైలుదూరంలో వినపడేలా గర్జించేవారు.1933లో సతీసావిత్రి లోయమధర్మరాజుగా  సినీరంగ ప్రవేశం చేశారు. శ్రీ కృష్ణ లీల లు లో కంసునిగా దుమ్ము లేపారు.అందులో  సినీ సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు కృష్ణునిగా నటించారు."పోబాల పొమ్మికన్...ధిక్కారము సైతునా"అని ఆయన పాడిన పాటలు పద్యాలు ఆరోజుల్లో  అందరికీ కంఠోపాఠం!5వేలనాటకాల్లో నటించారు.హెచ్. ఎం.వి.వారు ఈయన పాటలు పద్యాలు రికార్డు చేశారు. ఫ్రీగా నటించి ఎన్నో నాటకసంస్థల్ని లాభాల బాట పట్టించారు.తన60వ ఏట1955లో అమరులైనారు.ఆయన సంతతి కనీసం  వారిని మనకు  పరిచయం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. 🌹
కామెంట్‌లు