మినీలు ; - జయా
 అమ్మా
నీ లాలిపాట
అప్పుడూ
ఇప్పుడూ
ఎప్పుడూ
మరవలేనమ్మా
అటువంటి కవితొక్కటికూడా
ఇప్పటికీ చదవలేదమ్మా
===========================
చదువుతున్న పేజీయే
ఏ పేచీ లేకుండా
బాగుందనుకుని 
అక్కడే ఉండిపోతే
ఈ జీవితపుస్తకంలోని
మిగిలిన పేజీలు 
చదివేదెప్పుడు?
========================
ప్రతి దానికీ
కృతజ్ఞత చెప్పాలి
ఎందుకంటే
ఏదో ఒకటి నేర్పుతుంది
అది
మంచైనా కావచ్చు
లేక
కళ్ళు తెరిపించొచ్చు
========================
నాలోని బాల్యం
ఆకాశంలో అప్పుడప్పుడూ
కన్పించే
కొన్ని  విచిత్ర రేఖలను
చూసి నవ్వుతుంది
నిండుగా 
==================
ఉల్లిపాయలు,
టొమాటోల
ఆయుష్షు 
కొద్ది రోజులే అన్నట్టు
డబ్బు ఆయుష్షూ
స్వల్పకాలమే
అయ్యుంటే
మానవత్వమనేది 
ఇంకొంత కాలం ఉండేదేమో
మనిషిలో
=========================

కామెంట్‌లు