మహారాణి మృగావతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 వత్సదేశపురాజు  శతానీకుడు.అతని పట్టమహిషి  రాణి మృగావతి అందాల రాశి! ఉజ్జయినిరాజు చండప్రద్యోతుడు ఆమెచిత్రాన్ని చూసి ఆమెను తనకు అప్పగించమని శతానీకుని దగ్గరకు ఒక దూతను పంపాడు."నీభార్యను నాకు అప్పగించు"అని హుకుం జారీ చేశాడు.అంతే అగ్గి మీద గుగ్గిలంలా రాజు మండిపడ్డాడు.చండాలుడైన ఆకాముకుడు సైన్యం తో విరుచుకు పడటంతో హఠాత్తుగా శతానీకుడు గుండె పోటుతో ప్రాణం వదిలాడు. రాణి స్వయంగా శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. వత్సదేశంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు రాణికి అండగా నిలిచారు. కానీ అపార శత్రుసైన్యం ముందు చిగురు టాకులా వణకసాగారు.రాణి భగవాన్ మహావీరుని ధ్యానిస్తూ కూచుంది.భగవాన్ స్వయంగా రాజమహల్ కి వచ్చి రాణీకి అభయం ఇచ్చాడు.రాణి ధైర్యం గా  అన్ని కోటద్వారాలు తెరిపించింది.చండుడు ఠీవిగా  దర్పం అహంకారం తో మదోన్మత్తుడై రాణీ వాసంలోకి వచ్చి అక్కడ భగవాన్ మహావీరుని చూస్తూ నే తెలీని తాపం బాధ తో తపించసాగాడు.వాడిలో ఏదో మార్పు పశ్చాత్తాపం బాధ! భగవాన్ ఇలా అన్నాడు "రాజా! నీవు బుద్ధి తెలివి విచక్షణ కలవాడివి.హింసను ప్రకోపించనీయకు." రాణి  ఆయనతో ఇలాఅంది"భంతే! నాభర్త ఈలోకాన్ని విడిచి వెళ్లాడు.నేనింక సాధ్విని(సన్యాసి)కాదల్చు కున్నాను.కానీ నాకొడుకు ఇంకా చిన్న వాడు.వాడిబాధ్యత ఆలనా పాలన ఎవరు చూస్తారు?" విషాదం  బాధ్యత తో ఆమె ప్రశ్నించింది. వెంటనే చండప్రద్యోతుడు ఇలాఅన్నాడు"అమ్మా!చెల్లెమ్మా! రాకుమారుడు ఇప్పటి నుంచి నాకొడుకు! అతని బాధ్యత నాకు అప్పగించండి." తన కొడుకు  ఉదయుని అతని చేతిలో పెట్టి "అన్నా!ఇకనుంచీ  నీవే మేనమామ వి.సంరక్షకుడివి"అంది.ఆమె భగవాన్ అనుగ్రహంతో సాధ్విగా మారింది. మనశత్రువు పై దురభిప్రాయం  తుడిచేసి నిర్మోహత్వంతో మెలగాలి అని భగవాన్ ఉపదేశం! శత్రుభావన ద్వేషం తో కడుపు రగిలితే మనం తినే అన్నం కూడా విషంగా మారుతుంది. ఇదే మహావీరుని సందేశం 🌹
కామెంట్‌లు