మహా మనీషులు! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 పచ్చయప్ప కాలేజీ ఇంటర్వ్యూ కి ఓయువకుడు వచ్చాడు. "మాకాలేజీ జస్టిస్ పార్టీది.మారూల్స్ ప్రకారం నడవాలి "అన్నారు వారు. "నాప్రతిభను  చదువు చెప్పటంలో చూడండి. మీరాజకీయాలతో నాకేం పని?"అని చురక అంటించి చురుకు గా బైటకి దూసుకుపోతుంటే "బాబూ!అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరు"అని వెంటనే వెనక్కి పిల్చి ఉద్యోగం ఇచ్చారు. ఇది1927లో జరిగిన సంఘటన! ఆయనే ఆచార్య ఎన్.జి.రంగా!1934లో యూనియన్ జాక్ పతాకంని దింపేసి కాంగ్రెస్ జెండా ఎగరేసిన రంగా ని"బాబూ!నీవు చేసిన పని చట్టవిరుద్ధం కాదా?"అని గాంధీజీ అంటే"మీరేగా  బ్రిటిష్ వ్యతిరేకంగా శాసనోల్లంఘనం చేయమన్నారు?"ఠకీమని రంగాజీ జవాబు!గాంధీజీ ముసిముసినవ్వులు!"ప్రపంచ కర్షకులారా!ఏకంకండి!"అంటూ1935-52దాకా అఖిల భారత రైతుసభలు చేనేతకాంగ్రెస్ ఏర్పాటు చేసిన కర్షక కార్మిక బంధువు ఆయన!పద్మవిభూషణ్ రంగా రాసిన గ్రంథం "క్రెడో ఆఫ్ వరల్డ్ పెజెంట్రీ" ని కాపిటల్ గ్రంథంతో పోల్చి ప్రశంసించింది ప్రపంచమంతా!
ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డిగారు "నేను జీవితాంతం శాకాహారిగా ఖద్దరుమాత్రమే ధరిస్తా"అని ప్రతినబూని ఆచరించిన మనీషి!క్రిమినల్ లాయర్ గా పేరు డబ్బు వదులుకుని స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొన్నారు. "మీటోపీకింద ఏమి ఆలోచనలు?! మాకు టోపీ పెడ్తారా?"ప్రతిపక్ష దాడికి ఫక్కున నవ్వే పసిమనసు.జీవితం అంతా బ్రహ్మానందం గా తాను నవ్వుతూ విరోధులనుకూడా నవ్వించి స్నేహబంధం నిలుపుకున్నారు.
బంకించంద్ర ఛటర్జీ1875లో కలకత్తా నించి తన స్వస్థలం  కాంతర్పాండా వెళ్తూ దారిలో పొలాలు పళ్ళతోటలు చూస్తూ వందేమాతరం రాశారు.ఆనంద మఠ్ అనే నవలలో రాసిన ఈపాట ప్రభావం అందరికీ తెలిసిందే!1880లోరెండేళ్లపాటు వంగదర్శన్ పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఫ్రాన్సులో మేడం కామా భారత పతాకం మధ్యలో దేవనాగరి లిపి లో ఆపాటని నినాదంగా రాయించింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సభలో సుభాష్ చంద్రబోస్ స్వయంగా ఈపాట పాడారు. చిన్నారి బంకిం  బడిలో చేరకముందే వంగభాషలోని అక్షరాలని ఒకేఒక్క రోజులో నేర్చుకున్న మేధావి.బంకిం అంటే "వంగిన"అని అర్ధం. విదియనాటి చందమామ అని బంకిం చంద్ర కి పూర్తి అర్ధం. ఈయన తండ్రి  ఈయనకూడా డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగం చేశారు. ఇక రచయిత గా బంకిం రాసిన దుర్గేశనందిని నవల 5ఏళ్ల వ్యవధిలో 13సార్లు ప్రచురింపబడింది. బంకిం బాబు తన53మూడవ ఏటనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 🌹

కామెంట్‌లు