ఆధ్యాత్మికం :- అంతా హఠ యోగమే...! -- కోరాడ నరసింహా రావు.

 పూరక, కుంభక, రేచకమ్ములవి 
హఠ యోగమ్మున జరుగునివి !
  సృష్ఠి, స్థితి, లయము లివే.... 
జనన,జీవన,మరణములునివే 
 ప్రాణముపీల్చుక  జన్మమునెత్తి 
కుంభకమునఅది ఉన్నంతదాక 
జీవించి...,ఊపిరివదలి
తనువునుచాలించుమర్మమేనోయిహఠ యోగ మన్న !
 యోగమన్నచో...ప్రాప్తమెనోయి
.ప్రాప్తిoచిన ఈ మానవ జన్మను
 సత్ వినియోగముతో సార్ధక 
   మొనరించు  కొనవోయీ !
   ఈ హఠ యోగి...క్రియాయోగ
సాధనజేయుటె,మోక్ష మార్గము న పయనించుటోయి !
 నాసికాపుటల మార్గముగుండా
ప్రాణవాయువును లోనికిపంపి,
 పంచ ప్రాణముల ఏకము జేసి, 
ఆ మూలాధార వాసిని లేపి.... 
షట్చక్రమ్ముల ప్రదక్షిణ లతో.....
సుషుమ్న ను చేరి... యుక్తి తో.. 
ఆద్వారముచ్చేదించి...
సహస్రారమునసహస్రదళకమలజలధిలో
ఆనంద జలకములాడి,పరి శుద్దాత్ముడవై...
ప్రాణమునుకుం భించి,లంఘించి,కపాలగోడను
 పగుల గొట్టుకుని ముక్తుడవై మోక్షమునొంది 
నీ నిజస్థానమౌ ఆపరమాత్మపాదములచెంతకు
చేరి...మరుజన్మలేని...సుఖమును  బడయుము... !
ఇదియే... ఈ మానవ జన్మకు సార్ధకత... !!
    ********
కామెంట్‌లు