వ్యాసభగవానుడు--సాహితీసింధు సరళగున్నాల;
ప్రక్రియ:పద్యం(కందాలు)
పారాశర్యుడు రచనల
వీరుడు ,వేదములువ్రాసి ప్రేరణగొలుపన్
భారతగాధను జెప్పియు
సారథియై నిలిచెకవుల ,శాస్త్రములందున్

వ్యాసభగవానుడనుచును
భూసుర ,పండితులునెల్ల పొగుడుచునుండన్
వాసిని పొందెను యుగముల
భాసురమై వెలుగులందె భవ్యుండితడే

కామెంట్‌లు