* నానీలు *కోరాడ నరసింహా రావు

 ఒక ప్రాణిని... 
  మరొక ప్రాణి 
    చంపుకు తినటం 
      ప్రకృతిలోని వికృతం !V
   *******
సృష్టిలో ఒకజాతి 
 వేరొకజాతిని హింసిస్తే 
    మనిషి... 
       సాటి  మనిషినే !
    ******
సమూహాలు.... 
  సమాజాలైనా... 
   నరుడు మానవుడవలె 
     దానవుడయ్యాడు !
    ******
విజ్ఞాన కాంతిలో 
  మనిషి మసకబారి 
    మానవత్వం 
      మాయమై పోయింది !
   ******
శ్రమతగ్గి... 
  సుఖించటానికి 
   సృష్టించుకున్న సైన్సే 
    దుఃఖ కారక మైంది !
   ******
కామెంట్‌లు