ప్రజా శ్రేయస్సు కోసం ;--బాలవర్ధిరాజు మల్లారం

 నా కవి లోకంలో కొందరిది
పైన పటారము 
లోన లొటారము 
కొందరు 
కంట్లో కన్నీటి సంద్రాన్ని అదిమి 
కలంతో మధుర భావాల పన్నీటిని చిలుకరిస్తుంటారు.
నిజానికి 
కవులు రాసేది 
వాళ్ళ కోసం కాదు 
ప్రజల కోసం 
కొందరు కవులు 
రోజూ దారిద్ర గరళాన్ని సేవిస్తూ కూడా 
అక్షరామృతాన్ని పంచిపెడుతున్న
అపర శివులు! 
సమాజ శ్రేయస్సును ఊహిస్తూ 
రోజూ పద గోపికలతో రమిస్తున్న 
అపర శ్రీకృష్ణ భగవానులు!
జగతి ప్రగతి కోసం తపిస్తూ 
ఫక్కా ప్రణాళికలను రచిస్తున్న
అపర బ్రహ్మలు !
లోక కల్యాణార్థం శాంతి సామరస్యాలను ప్రబోధిస్తున్న 
అపర బుద్ధ దేవుళ్ళు!
అజ్ఞానపు చీకట్లను తొలగిస్తూ 
విజ్ఞానపు వెన్నెలలను ప్రసాదిస్తున్న 
సాహితీ చంద్రులు!
అవినీతి,అక్రమాలపై పెన్నునే గన్నుగా చేసి 
అక్షర యుద్ధం చేస్తున్న అక్షర సైనికులు!
కవి కవిత్వం కోసం 
కవిత్వం ప్రజా శ్రేయస్సు కోసం 

కామెంట్‌లు