పరాయి సుద్దులు ..!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ..
 ఆవిడకి అది 
ఎన్నోపెళ్లి అయితే 
మనకెందుకు ?
అతడికి ఆమె 
ఎన్నోభార్య అయితే 
మనకెందుకు ?
వాళ్లు కలిసి జీవిస్తారా 
పెళ్లిచేసుకుంటారా ?
పిల్లలని కంటారో లేదో ..
ఇవన్ని ఆ..సెలబ్రిటీల 
స్వంత విషయాలు !
వాటిల్లో తలదూర్చడం 
మనందరి -
మూర్ఖత్వానికి పరాకాష్ట !!
                   ***

కామెంట్‌లు