అంశం:—అంశం;- సత్యవాణి
 అంశమేదైతేనేమి
అవలీలగా వ్రాసే కవులు మనకువున్నపుడు
మదనపడేలా మసుకు హత్తేలా
వ్రాయగలుగు కవులుమనకున్నపుడు
అంశమేదైతేనేమి
అవలీలగా వ్రాసేస్తారు
సమాజాన్ని జాగృతం చేసే
అంశమైనపుడు
కత్తిలా వాడిగా
శరంలా గురిచూసి గుండెలకు తాకేలా
కలంఝుళిపిస్తారు
కవనాలు అల్లేస్తారుమనకవులు
అంశమేదైతేనేమి
అవలీలగా వ్రాసేస్తారు మనకవుల
కులమతజాతి బేధాలెంచరు
సత్యాన్ని పత్యంగాపంచి
సంఘాన్ని పట్టిపీడిస్తున్నవ్యాధిని 
పదాలఔషధాలతో మళ్ళిస్తారు
అంశమేదైతేనేమి
మనకవులకు
అవలీలగా కవనమల్లేస్తారు
అర్థవంతమైన కవితలను సృష్టిస్తారు
        

కామెంట్‌లు