ఘనముగా...పండుగచేద్దాము;-కోరాడ నరసింహా రావు
మనస్వతంత్ర భారత జాతీయ జెండా పిలుస్తోంది మిము.... 
  బాలల్లారా.... !
  ఈ దేశానికి వారసులు మీరె... 
రేపటి భారత పౌరుల్లారా... !!

ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ 
మట్టిలో మనము పుట్టటము !
  ప్ర పంచం లోనె పవిత్రమైనది, 
ఈకర్మభూమి...మనధర్మభూమి

పాడి,పంటలకుసిరిసంపదలకు 
నెలవైనది మన దేశం !
  వెలకట్టలేనిమనదేశసంపదను
దోచుకున్న పరదేశు లెందరో... !

కుట్రలూ కుతంత్రాలతో  మనల 
బానిసలుజేసి ఎలినారు ఆ ఆం గ్లేయులు... !
  ఎందరెందరో దేశభక్తుల పోరా టాలూ,బలిదానాలతొ వచ్చెను 
మనకు స్వాతంత్య్రం !

 ఇదిమమనకు డెబ్భై ఐదవ స్వ
తంత్ర దినము... ఘనముగపం డుగ చేద్దాము... !
 ఇంటింటా జెండాను ఎగరేసి ఆ 
త్యాగమూర్తులనుతలచుదము 

మన ఖ్యాతిని  నిలబెట్టి.... 
 దేశానికి రక్షగ నిలిచెదమని... 
  మన గౌరవాన్ని కాపాడెదమని 
    అందరమూ శపధంచేద్దాము
అందరమూ శపధం చేద్దాము !!

మన స్వతంత్రభారత జాతీయ జెండా పిలుస్తోంది మిము పిల్ల లూ.... !
   ఈ దేశానికి వారసులు మీరే 
రేపటి భారత పౌరులూ.... !!
     *******

కామెంట్‌లు