కబడ్డీ ;- పెందోట వెంకటేశ్వర్లు--సిద్దిపేట
రారండోయ్ రారండి
 పిల్లల్లారా రారండి 

ఆటలు ఎన్నో ఆడదామా
 పాటలు ఎన్నో పాడుదమా 
ఆటలు పాటలు ఆడుతూనే
 ఆనందాన్ని పంచుదమా

 కబడ్డీ కబడ్డీ కబడ్డీ  యనుచు 
వీడవని కూతలు పట్టుదమా 
కాలును చేయిని తాకిస్తూ
 ధైర్యసాహసాలు చూపిద్దామా 

వచ్చినోడిని భయపడుతూనే
 పట్టుటకై ప్రయత్నిస్తూనే
 వారినే చూస్తూ గట్టిగా పట్టిన
 వచ్చును మనకు విజయంరా
 


కామెంట్‌లు