మా అప్పులే తీరాలి ఉయ్యాల ;=కోరాడ నరసింహా రావు!
 బతుకమ్మ - బతుకమ్మ      ఉయ్యాలో ...
 బంగారు    మాతల్లి  ఉయ్యాలో.... !
ఉడుపులు అయిపోయి ఉయ్యాలో... 
సేను ఏపుగా ఎదగాలి  ఉయ్యాలో !
  వర్షాలు కురవాలి ఉయ్యాలో 
ఎరువులే ఎయ్యాల ఉయ్యాలో 
కంకు కట్టి పొలము ఉయ్యాలో 
పంటనిండుగా......పండాల
ఉయ్యాల !
కోతలే కొయ్యాల ఉయ్యాలో... 
మోతలే మొయ్యాలఉయ్యాల 
కుప్పలే ఎయ్యాలఉయ్యాలో... 
నూరుపులు నూరసాల ఉయ్యాల.....!
బస్తాలలో పోసి, బండికెక్కించి 
ధాన్యలక్ష్మిని మాయిళ్లకే జేర్చాల ఉయ్యాల !
బతుకమ్మ - బతుకమ్మ ఉయ్యా లో

బంగారుమాతల్లి ఉయ్యాలో 
మా గాదెలే నిండాలి ఉయ్యాల 
మా అప్పులే తీరాల ఉయ్యాల 
పిల్ల, పాపలతోటి ఉయ్యాలో 
మేముసల్లగా ఉండాల ఉయ్యాల.... !
      *******
కామెంట్‌లు