బద్ధకస్తుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ.
 మానవునికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలా ఉంటాయో జీవికి కూడా  సంచితము (పూర్వ జన్మ), ప్రాప్తము (ప్రస్తుత జన్మ) ఆగతము (రాబోయే జన్మ)  ఉంటాయి. ఏ వ్యక్తి ఎన్ని జన్మలు అయితే అతనికి ముక్తి వస్తుందో ఎవరికీ తెలియదు. అతను చేసిన మంచి, చెడు పనుల ఫలితాలను తప్పకుండా అనుసరించి తీరవలసినదే మన పెద్ద వాళ్లు మనకు ఒకటి చెబుతారు ఒకరి కడుపు నింపు  పది మంది వచ్చి నీ కొడుకుల కడుపులు నింపుతారు. ఒకరి కడుపు కొట్టు 100 మంది వచ్చి నీ కొడుకుల కడుపులు కొడతారు. కనుక జీవితంలో ఒకరికి పెట్టడానికి  అలవాటు పడాలి తప్ప కడుపులు కొట్టడానికి  అలవాటు పడకూడదు.  మనం మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడు చేస్తే చెడు ఫలితం వస్తుందని మన పెద్దలు మనకు బోధించిన నీతి  దానిని అనుసరిస్తే జీవితంలో సుఖశాంతులు లభ్యమవుతాయి అని విజ్ఞులు చెప్పేపాఠం. దీనికి వేమన ఎంత చక్కటి పోలికను ఇచ్చాడంటే  రైతు పొలాన్ని దున్ని  నీరు పెట్టి  మొక్క వేసి ఊడ్చి అది పెరిగిన తరువాత  దానిని కోసి కుప్ప వేసి నూర్చి  ఆ ఫలితాన్ని పొందుతాడు.  అసలు పొలంలో విత్తునే  వేయకుండా కోతల సమయంలో వెళ్ళి కోయడానికి సిద్ధపడితే  అది అమాయకత్వమా? అజ్ఞానమా? మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలితం పొందుతాం  పని చేయకుండా ఫలితం ఆశించడం వెర్రితనం అనే వేమన వ్యాఖ్య. అందుకే వారిని ప్రజాకవి వేమన అన్నారు. 


కామెంట్‌లు