కుంబల్‌ఘర్ కోట. ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై ,
 రాజస్థాన్ రాష్ట్రం లోని రాజ్‌సమంద్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మింపబడిన కోట, ఇక్కడి కోట గోడ చుట్టూ గల ప్రాకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా మహా కుడ్యము తర్వాత రెండవ అతి పెద్ద గోడగా ఖ్యాతికెక్కింది. కుంభాల్‌గఢ్ కోటతో పాటు, శిల్ప సౌందర్యం ఉట్టిపడే 300 అతి పురాతన హిందూ దేవాలయాలు చుట్టూ ఈ మహాకుఢ్యాన్ని నిర్మించారు. రాణా కుంభ పాలనలో 15వ శతాబ్దంలో రాజమహల్ చుట్టూ 36 కిలో మీటర్ల పరిధి మేర ఈ గోడ నిర్మించారు. శత్రు దుర్భేద్యమైన ఈ మహా కుడ్యాన్ని గ్రేట్‌వాల్ ఆఫ్ ఇండియాగా వర్ణించడంలో అతిశయోక్తి లేదు. వెడల్పాటి గోడలు ఉన్న ఈ గోడ చైనా గోడను తలపిస్తుంది.
ఈ ప్రాకారం వైశాల్యం 15 మీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 13 పర్వత శ్రేణులు, లోయలను కలుపుతూ పాము మెలికలను పోలి ఉంది. మొత్తం 7 మహాద్వారాలు, 7 వసారాలు, బురుజులు, కోట గడీల నిఘా వ్యవస్థ కలిగి ఉంది. సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. పటిష్ఠమైన రాతి ఇటుకలతో వూహించని రీతిలో వైవిధ్యమైన ఆకృతుల్లోరూపొందించారు. ఈ కోటను గోడ కింద నుంచి చూస్తే పర్వత శ్రేణిలాకనిపిస్తుంది. కోట మధ్యలో బాదల్ మహల్ ఉంది. అందులో అందమైన గదులు మనోహరమైన రంగులతో గోడలు ఉన్నాయి.

కామెంట్‌లు