పిల్లి తిన్న కోడి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 సమాజంలో అందరూ ఒక మాదిరిగానే ఉండరు. స్వయంకృషితో  సంపాదించుకుంటూ తన సంసారాన్ని గడుపుతూ ఏ ఒక్కరి చేతమాట పడకుండా జీవించే కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది పరాన్న భుక్కులు కూడా ఉంటారు.  వారు సంపాదించలేరు  స్వయం కృషి చేయాలన్న ఆలోచన రాదు. ఎలాంటి వ్యాపారాలు చేతకాదు. అయినా ఆడంబరంగా జీవించాలన్న కోరిక మాత్రం పోదు. మాటలు నేర్చుకుంటారు ఎంత తియ్యగా కబుర్లు చెబుతారో చెప్పలేము. నిజానికి ఇలాంటి పాత్రలను సినిమాలలో చూస్తూ ఉంటాము వారి చర్యలకు నవ్వుకుంటూ ఉంటాము. కాలక్షేపానికి అది సరిపోతుంది  నిజ జీవితంలో ఇలాంటి వాళ్ల బారినపడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది  ఆ కబుర్లు చెప్పే వ్యక్తి  లక్షాధికారిగా కోటేశ్వరునిగా మారతాడు.  ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు త్వరగానే వస్తుంది రాగానే వడ్డీతో సహా నీకు ఇస్తానని మాయమాటలు చెప్పి తనకు కావలసినంత డబ్బు తీసుకుంటాడు. ఆ డబ్బు ఇచ్చిన వ్యక్తికి  నిజమైన అవసరం వచ్చి డబ్బు కోసం  వారి ఇంటికి వెళితే రేపని మాపని గడుపుతాడు తప్ప నయాపైసా కూడా ఇవ్వడు.  ఇచ్చేవాడైతే అసలు అప్పు ఎందుకు చేస్తాడు అందుకే వేమన గొప్ప సత్యం చెప్పాడు. నీవు ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకున్నావో అతని గురించి పూర్తిగా తెలుసుకో మంచివాడు తిరిగి ఇస్తాడు అని నమ్మకం ఉంటే ఇవ్వు లేకుంటే వద్దు అని సలహా చెబుతున్నాడు. మనమంతా ఆచరించవలసిన మాట కదా అది. దానికి ఉదాహరణ చెబుతూ వేమన ఇంటిలో గృహిణి కోళ్లను పెంచుతూ ఉంటుంది. భో భో అని పిలవగానే వస్తుంది ఆ కోడి. దాని జాతకం బాగుండక దానిని పిల్లి తింటే ఎన్ని సార్లు పిలిచినా వస్తుందా ? 


కామెంట్‌లు