సుప్రభాత కవిత ; బృంద
లేత బంగరు వెలుగులు
జగతిని కనకమయం చేస్తుంటే

వినువీధిని రంగుల తోరణాలు
గగనానికి  సొబగులు అద్దుతుంటే

విపంచికల ఉదయరాగాలు
హృదయాలను మేల్కొలుపుతుంటే

ప్రతి ఉదయం  నిత్య నూతనం
ప్రతిక్షణం  అపురూప వరం.

వెలుగుతో ఊపిరి
వెలుగుతో ఉత్సాహం 
వెలుగుతో ఉత్తేజం
వెలుగుతో ఉధ్ధీపనం

ఉషస్సున  వెలిగే  మనసే
మనలోని దైవానికి 
మనమిచ్చే నీరాజనం

అంతరంగాన్ని అనుకూల
అలోచనలతో ప్రచోదనం చేసి

జీవితకథలో  మరోపుటను
ముచ్చటగా నింపుకునే
అవకాశమిచ్చిన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు