:జీవ ద్రవ్యమే సత్యం ;-ఎం. వి. ఉమాదేవి
అబద్దాల గాజుమేడ ఎదుట 
అందంగా అలరిస్తూ ఉంది 
తళుకులీనే గొప్పల మాటలు 
విరిగిన పింగాణీ కప్పులా 
మూల చేరాయి !
కొన్ని దురాశల స్వప్నాలలో  
లభించినట్టున్న రాతిపూసల 
హారాలు మెడనిండా వీర తాళ్లు 
యే మూలనో బయటపడ్డ ఉలి 
అసంపూర్ణ శిల్పాలను 
చెక్కేదానికి నిరాకరిస్తుంది !
శిల్పివెనుదిరుగుతాడు !!

జాతి మూలాలలో దాగిన 
సత్యమనే జీవ ద్రవ్యం 
మనిషికి అష్టలక్ష్మి వైభవం 
మానసిక ఉల్లాసం 
పదిలంగా దాచుకో!!

ఎం. వి. ఉమాదేవి 
నెల్లూరు

కామెంట్‌లు