మినీలు ; -- జయా
 మోసగించి
డబ్బులు కూడబెట్టొచ్చు
కానీ
ఆ డబ్బుని అనుభవించడానికి
ఆయుష్షును పెంచుకోలేవు
==================
అడిగిన బొమ్మను 
కొనివ్వలేక పోయిన 
ఓ తండ్రి 
తన పిల్లాడికి
"ఓ కుక్క కథ" చెప్పడానికి
ఆలోచించి
దుకాణంలోంచి 
బయటకొచ్చాడు....
===================
 బిడ్డను
మొట్టమొదటిసారిగా
స్కూల్లో విడిచిపెట్టి
బిక్కుబిక్కుమంటూ
ఇంటికి చేరి కన్నీరు కార్చే 
ఓ తండ్రి కన్నీటికన్నా పవిత్రమైన
కన్నీరు మరేదైనా ఉంటుందా?
- తమిళంలో చదివిన మాటలివి

కామెంట్‌లు