నిశ్చిoత ;-ఎం. వి. ఉమాదేవి
సాయి వనంలో సాహిత్యం 
అంశం -చిత్రకవిత 
నిర్వహణ -సుజాత గారు 
ఆట వెలదులు 
===================

పచ్చిగడ్డి లోన  పవ్వళించిన రైతు 
కాలిమీద కాలు మేలిశయ్య 
ధనము లేని చింత తనకునే మియులేదు 
నేటికన్న మున్న నెనరు చాలు !!

పాడిపసుల మేపు పనులవి యుండగా 
పంటచేని యందు జంటగాను 
మహిళ బువ్వ కొరకు మరలెను  గృహముకు 
సేద దీరె రైతు  సేద్యమాపి !!


కామెంట్‌లు