*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0125)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు హర్యశ్వులకు, శబలాశ్వులకు జన్మనిచ్చుట -  నారదునకు శాపం ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *నా ఆజ్ఞ పొందిన దక్షుడు తన తపశ్శక్తితో అనేక వేలమంది జీవులను మానసికంగా సృష్టి చేస్తున్నాడు. తన వల్ల ఈ భూమి మీద జీవుల సంఖ్య పెరుగుతోంది అని గుర్తించని దక్షుడు, మళ్ళీ నా గురించి తపస్సు చేసి, నేను సృష్టి చేస్తే పెరగడం కాకుండా జీవులు తమంత తామే సృష్టి చేయగలిగే వరం అడిగాడు.*
*పరమ పూజ్యడు, దేవతలలో శ్రేష్టుడు, కరుణామయుడు, భగవంతుడు అయిన శివుడు నీకు మేలు చేస్తాడు. నీవు ప్రజాపతి వీరుణుని  (పంచజనుడు) కూతురు అసిక్ని ని వివాహం చేసుకోమని చెప్పాను. దక్షుడు అసిక్ని తో ఎంతో మంది సంతానమును పొందుతాడు. ప్రజాపతి వీరుణుని కూతురు అసిక్ని ని వైదికముగా వివాహం చేసుకుని హర్యశ్వులు అనబడే పదివేలమంది సంతానాన్ని కంటాడు. వారు పుట్టుకతోనే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, తండ్రి మీద భక్తి గౌరవాలు కలిగి వైదిక మార్గములో వుండే వారు. వారిని చూసి దక్షుడు సంతానమును సృష్టి చేయమని చెప్పాడు.*
*తండ్రి మాట పాటించే ఆలోచనతో హర్యశ్వులు పశ్చిమ దిశగా ప్రయాణం చేసి నారాయణ సరము అనే పవిత్ర తీర్ధాన్ని చేరుకున్నారు. ఇక్కడ సింధు నది సముద్రములో కలుస్తుంది కనుక ఇక్కడి నీరు పుణ్య తీర్థం అయ్యింది. ఈ తీర్థాన్ని తాకడంతో హర్యశ్వుల మనసులో పరమహంస దర్శనమై పులకించి పోతారు. సంతాన వృద్ధి కోసం తపస్సు మొదలు పెడతారు. అప్పుడు వారి దగ్గరకు నువ్వు (నారదుడు) వెళ్ళి "మీరు ఈ భూమి యొక్క చివర చూడకుండా సృష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు భూమి యొక్క చివర తెలుసుకోండి" అని చప్పావు. ఈ మాటలు విన్న హర్యశ్వులు, మన తండ్రి ఎంతో శాస్త్ర స్వరూపుడు. ఆయన మాట మనము సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుని, నీకు ప్రదక్షిణ నమస్కారం చేసి భూమి అంతము చూడాలని వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు. మోక్షతీరాలకు చేరుకున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు