*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0129)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి తపస్సు కు దేవతలు సంతుష్టులు అవడం - దేవతలు కైలాసమునకు వెళ్లి సదాశివుని స్తుతించుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*నారదా, ఒకనాడు మనమిద్దరమూ సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళాము. మన ఇద్దరిని ఎంతో ఆధరముతో ఆహ్వానించి, సముచితమైన ఆసనములు, అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, పాద పూజ చేసి నమస్కరించాడు, దక్షుడు. అక్కడే వున్న చిన్నారి సతీదేవి తండ్రి మనకు చేస్తున్న ఉపచారాలు చూసి తాను కూడా ఎంతో గౌరవభావంతో మన ఇద్దరికీ నమస్కరించింది. అప్పుడు, నేను సతీదేవి ని, "నీవు ఎవరిని భర్తగా పొందాలి అనుకుంటున్నావో, ఎవరు నిన్నే కోరుకుంటున్నారొ, అటువంటి సర్వజ్ఞుడు, జగదీశ్వరుని, మహాదేవుని నీవు భర్తగా పొందుతావు. ఆయనే నీకు తగిన వాడు" అని ఆశీర్వదించి అక్కడ నుండి మనం మన మన స్వస్థలాలకు వెళ్లాము.*
*ఈ ఆశీర్వచనం విన్న దక్షుడు కూడా తన కోరిక కూడా అదే కనుక, మహాదేవుడు రుద్రుడు తనకు అల్లుడు అవుతాడు అని సంతోషించాడు. ఇక్కడ సతీదేవి కూడా బాలగా తన విన్యాసాలు చూపుతూ, దిన దిన ప్రవర్ధమానం అవుతోంది. కుమారావస్థ నుండి యవ్వనం లోకి అడుగిడింది. కానీ, ఏరోజు కూడా శివ ధ్యానం వదిలిపెట్టలేదు. జగత్తుకు పతి అయిన శివదేవుని భర్తగా పొందాలి అనే ఆమె కోరిక ఇంకా బలపడింది. దక్షుడు, జగత్పతిని తన అల్లునిగా చేసుకోవడం ఎలాగా అని ఎన్నో విధాల ఆలోచనలు చేస్తున్నాడు. కనపడిన వారిని అందరినీ సలహాలు అడుగుతున్నాడు.*
*అన్ని సుగాణాలు రాశి పోసినట్టు వున్న సతీదేవి అయిన ఉమ, తన తల్లి అయిన వీరిణి వద్దకు వెళ్ళి, "నేను శంకరుని పతిగా పొందాలి అని నిశ్చయించుకున్నాను. ఎంత కఠినమైన తపస్సు అయినా ఆచరించి ఆ త్రిలోక నాధుని నా పతిగా చేసుకుంటాను. తపస్సు చేయడానికి నాకు అనుమతి ఇవ్వ వలసింది" అని అడుగుతుంది. సలక్షణంగా, సహేతుకంగా వున్న కూతురి కోరికను విన్న వీరిణి, భర్తను సంప్రదించి లోకవందితుడైన త్రనేత్రుని పతిగా పొందే కోరికతో శివదేవి చేయాలనుకున్న తపస్సు కు అనుమతి ఇస్తుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు