బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి శివుని వరునిగా వరం పొందడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*దక్షుని కూతురు సతీదేవిని వివాహమాడటానికి ఒప్పుకున్న రుద్రుడు, తనను పతిగా పొందాలని ఎంతో కాలంగా తపస్సు చేస్తున్న ఉమ అయిన సతీదేవి తపస్సుకు మెచ్చి ఆమె ఎదుట ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చాడు.*
*తన ఎదుడ వున్న తన దేవుడు, జగత్పతి, జగత్పిత అయిన శివదేవుని చూచి, సిగ్గుల మొగ్గ అయి, తలవంచి నమస్కారం చేస్తూ నిలిచింది. అప్పుడు ఆ స్వామి, బంగారు కాంతులతో వెలిగిపోతున్నాడు. తన మూడు ముఖాలలో మూడు మూడు కన్నులతో, నాలుగు చేతులలో, వరద, అభయ, త్రిశూల, బ్రహ్మ కపాలం ధరించి, భస్మభూషితమైన శరీర అంగములతో, తలమీద గంగమ్మ దివ్యమైన చిరునవ్వుతో, నుదుటి మీద తనకళలను చూపుతూ చంద్రునితో మహత్తరమైన సుందర విగ్రహం గా కనబడుతున్నాడు. ఈ సుందరమూర్తి భూమి మీద వున్న అందరి స్త్రీలను మోహపారవశ్యంలో ముంచి వేసేదిగా వుంది. ఇంతటి కమనీయ మూర్తి సతీదేవిని పత్నిగా స్వీకరించాలి అనుకుని వచ్చి కూడా, ఉమను తన కోరిక కోరుకోమంటాడు, రుద్రుడు.*
*తన మనసులో శివుని పతిగా భావించి చేసిన తపస్సు ఫలితంగా ప్రకటితమైన పరిపూర్ణ శివరూపమైన రుద్రుని చూచిన ఉమకు, తన కోరిక చెప్పడానికి నారీ సహజమైన సిగ్గు అడ్డు వస్తుంది. తన మనసు రుద్రునికి మాటల రూపంలో చెప్పడానికి, మనసు ఒప్పుకుంటున్నా, సరస్వతి సహకరించడం లేదు, తల్లిదండ్రుల మీది గౌరవం, సమాజ బాధ్యత, సిగ్గు కలగలిపి. ఇలా సతమౌతున్న సతీదేవి ఆలోచనలు పసిగట్టిన దేవదేవుడు "ఉమా! నీవు నన్ను పతిగా కోరుకుంటున్నావు" కదా! అన్నాడు. తలవూచింది, సతి. "నీ కోరిక తీరుతుంది. నేను నిన్ను పత్నిగా స్వీవకరిస్తాను" అని వరం ప్రసాదించాడు.*
*అప్పుడు, తన కోరిక తీరింది అనే ఆనందాన్ని అనుభవిస్తూనే, సమాజం పట్ల గౌరవం గుర్తుకు వచ్చి, తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి తనను గ్రహించాలని కోరుతుంది. అలాగే వస్తాను అని మాట ఇచ్చి, కైలాసానికి తిరిగి వెళతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి