బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి శివుని వరునిగా వరం పొందడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*దక్షుని కూతురు సతీదేవి శివుడు తన భర్తగా వస్తాడు అని వరము పొంది, పతమానందంతో తన ఇంటికి వెళ్ళింది. తన చెలికత్తెల ద్వారా తన తపస్సు, శివదేవుడు ప్రత్యక్షం అవ్వడం, తనకు రుద్రుడు ఇచ్చిన వరము గురించి తన తల్లిదండ్రలకు చెప్తుంది. శుభవార్త విన్న దక్ష ప్రజాపతి, వీరిణి చాలా సంతోషిస్తారు. తమ ఆనందాన్ని రాజ్యంలోని పురోహితులు, పండితులు, సామాన్య ప్రజలతో కూడా పంచుకున్నారు. పండితులకు, బ్రాహ్మణులకు వారు అడిగినంత సంపదలు ఇచ్చి గౌరవించారు. ప్రజలలో పేదవారు, అంధులు, వృద్ధులకు కూడా వారి వారి అవసరాలను తీర్చారు. పరమేశ్వరుని కూడా అనేక విధాలుగా కీర్యించి తమ కృతజ్ఞతలు తెలిపారు.*
*కొంత కాలం గడిచింది. దక్షుడు, సతీదేవి వివాహం ఎలా చేయాలి అని ఎన్నో విధాల ఆలోచిస్తున్నాడు. రుద్రుడు, సతీదేవికి వరం ఇచ్చి తిరిగి కైలాసానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు సదాశివుని తిరిగి కైలాసము నుండి నా రాజ్యానికి రప్పించడం ఎలాగా అనుకుంటున్నడు. తానుగా ఎవరినైనా పంపి వివాహం చేసుకోవడానికి రమ్మని పిలిస్తే ఆ నాగభూషణుడు రాకపోతే దేవగణం లో తన మర్యాద పోతుంది అనుకుంటున్నాడు.*
*అప్పుడు, బ్రహ్మనైన నేను నా భార్య సరస్వతీదేవి తో కలిసి దక్షుని ఇంటికి వెళ్ళాను. నా మానసపుత్రుడైన దక్షుడు, వీరిణి మా ఇద్దరికీ ఎదురు వచ్చి, స్వాగత సత్కారాలు చేసి, ఉచితాసనము ఇచ్చి, సపర్యలు చేసి మా ప్రయాణ బడలికను పోగొట్టారు. "దక్షా! నీ కూతురు సతీదేవి శివదేవుని భర్తగా పొందడానికే నీ ఇంట్లో పుట్టింది. రుద్రుడు గా వున్న శివదేవుడు కూడా సతీదేవి గా వున్న ఉమను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా వున్నడు. అందువల్ల నీవు రుద్రుడు, సతీదేవి ల వివాహం జరిపించడానికి శుభ ముహూర్తం నిర్ణయింప జేయి. నేను, నారదునితో కైలాసానికి వెళ్ళి, ఆ దివ్య ముహూర్తానికి రుద్రుని తీసుకుని వస్తాను. లోక కళ్యణ కార్యాన్ని జరిపించు." అని చెప్పాను. తన సమస్య ఈ విధంగా తీరింది అని సంతోషించాడు దక్షుడు.*
*తరువాత దక్షుని వద్ద శెలవు తీసుకుని, పరమేశ్వరుడు అయిన రుద్రుని చూడటానికి కైలాసానికి పయనం అయ్యాను.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి