బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివా శివుల అగ్ని నమస్కారం - వివాహ వేదిక మీద శాశ్వతంగా నిలిచి వుండటం - కైలాసమునకు వెళ్ళడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*కన్యాదానము చేసిన దక్షుడు రుద్రునికి అనేక కానుకలు వరకట్నముగా ఇచ్చాడు. అన్నీ ఇవ్వగల రుద్రునికి కానుకలు ఇవ్వగల వారు ఎవరు. అయినా, రుద్రుడు మానవ రూపంలో వున్నారు కనుక ఆచారము ననుసరించి కానుకలు తీసుకుని దక్షుని సంతోష పరిచారు, రుద్రుడు. లక్ష్మీ సహితంగా విష్ణువు రుద్రుని వద్దకు వెళ్ళి, "దేవదేవా! దయాసాగరా! మీరు జగత్తుకు తండ్రి, సతీదేవి తల్లి. మంచివారికి మేలు చేయడానికి, దుష్టులను శిక్షించడానికి, అవసరాన్ని బట్టి వవివిధ రూపాలలో దర్శనం ఇస్తారు. ఇది శృతి వాక్యం." అని చెప్పారు.*
*తరువాత, ఆచార్యుడు గా వున్న నేను, బ్రహ్మ, సతీదేవి చేత గృహస్థాశ్రమ పద్ధతిలో అగ్ని కార్యము, మిగిలిన కార్యక్రమం పూర్తి చేయించాను. శివా శివులు మంగళ వాయిద్యాలు మ్రోగు తుండగా, నృత్యగీతముల ఉత్సవము జరుగుతుండగా విధి పూర్వకంగా అగ్ని ప్రదక్షిణలు చేసారు.*
*అప్పుడు విష్ణువు, "మీరు ప్రధానము, అప్రధానము కూడా. మీరే ప్రకృతి. ప్రకృతికి అతీతులు. మీరు అనేకమంది గా విభజించబడతారు కానీ విభాగరహితులు. జ్యోతిర్మయ స్వరూపులు. పరమాత్మ అయిన మీ మూడు అంశలమే, రుద్రుడు, బ్రహ్మ, నేను కూడా. మీరే సగుణ బ్రహ్మము. ఒక శరీరంలో తల, ముఖము, చేతులు అని వివిధ అంగములు వున్నట్లే, మేము కూడా మీనుండి ఏర్పడ్డాము, కానీ మీరు మేము వేరు కాదు. మీరు నిర్విశేషబ్రహ్మ. రుద్రుడు గా వున్న మీరే పరమేశ్వరుడు. మీరే సర్వస్వము." అని కీర్తించడం, నేను, సనకసనందనులు, దేవగణములు ఎంతో ఆర్తితో విన్నాము.*
*విష్ణు స్థుతి విన్న రుద్ర దేవుడు ప్రసన్నుడు అయ్యాడు. వివాహ యజ్ఞము విధి పూర్వకముగా ముగిసినది అని సంతోషించాడు. ఆచార్యత్వము చేసిన నన్ను, బ్రహ్మ, ను చూసి" బ్రహ్మ దేవా! వైవాహిక క్రతువు చక్కగా నిర్వర్తించారు. మీరు ఏకోరిక కోరడానికైనా అర్హులు. మీ మనసులో వున్న కోరికను నిస్సందేహంగా అడగండి. నేను తీరుస్తాను" అని వరము ఇచ్చారు, రుద్రుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి