బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి ప్రశ్న - శివ భగవానుని విజ్ఞానము, నవవిధ భక్తి వివరణ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*తన ఎదుట నిలబడి లోక కళ్యాణం కోరుతూ ఉమ యొక్క పూర్ణరూపమైన సతీదేవి కోరిక విన్న, తన తలంపు చేతనే శరీర ధారణ చేయగలిగిన వాడు, యోగము ద్వారా భోగములందు విరక్తుడు అయిన రుద్రుడు ఇలా చెప్పాడు - దక్ష కుమారీ! మాహేశ్వరీ! ఈ భూమి పై వాసనులు / కోరికలలో చిక్కుకున్న వారు అప్పటికప్పుడు ముక్తులు అయ్యే విధానం చెపుతాను. విజ్ఞానమే పరతత్వము. మనిషికి విజ్ఞానము ఉదయించగానే "నేను బ్రహ్మను" - "అహం బ్రహ్మాస్మి" అనే భావం కలుగుతుంది. అప్పుడు బ్రహ్మము తప్ప వేరే ఏవిషయము మానవులకు గుర్తు రాదు. ఇటువంటి స్థితి పొందిన మానవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన మనసుతో ఉంటాడు.*
*పరతత్వము అనబడే విజ్ఞానము చాలా కష్ట సాధ్యము. ఈ ముల్లోకాలలో దానిని తెలుసుకో గలిగిన వారు ఎవరో ఒక్కరు వుంటారు. అలా పరతత్వమును తెలుసుకొనగలిగిన వాడు, ఎల్లప్పుడూ నా ఆత్మరూపంగా వుంటాడు. భోగము, మోక్షము అనే ఫలితాలను ఇవ్వగలిగే విజ్ఞానమునకు తల్లి వంటింది నాపై కలిగే భక్తి. నాపైన కలిగే భక్తి, నా అనుగ్రహం తోనే పుడుతుంది. ఇది సత్యం. ఇదే సత్యం. నా యందు కలిగే ఈ భక్తి తొమ్మిది విధములుగా వుంటుంది.*
*భక్తి - సగుణము, నిర్గుణము. భక్తి, జ్ఞానము లకు ఏమీ బేధం లేదు. భక్తడు, జ్ఞాని ఇద్దరూ కూడా ఎప్పుడూ సుఖానుభవమును పొందుతారు. నేను భక్తసులభుడను కదా, దేవీ! ఎల్లవేళలా నామీద భక్తి తో వుండేవాడు పుట్టుకతో తక్కువ వాడైన, నీచపు పనులు చేసే వాడైనా, వాని ఇంటికి నేను వెళతాను. ఇందులో సందేహం లేదు.*
*శ్లోకం:- భక్తౌ జ్ఞానేన భేదో హి తత్కర్తుః సర్వదా సుఖమ్| విజ్ఞానం న భవత్యేవ సతి భక్తివిరోధినః|| భక్తాధీనః సదాహం వై తత్ప్రభావాద్ గృహేష్వపి | నీచానాం జాతిహీనానాం యామి దేవి న సంశయః||*
(శి.పు.రు.సం.స.ఖం.23/16-17)
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి