*ఉత్పలమాల:*
*చిక్కనిపాలపై మిసిమిఁ | జెందిన మీఁగడ పంచదారతో*
*మెక్కినభంగి నీ విమల | మేచకరూప సుధారసంబు నా*
*మక్కువ పళ్ళెరంబున స | మాహిత దాస్యమనేటి దోయిటన్*
*దక్కె నటంచు జుర్రెదను | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! చిక్కని పాలపై మిసమిస లాడే తెల్లటి కాంతితో వచ్చే మీగడను చక్కెర తో కలిపి తినినట్లుగా, నీలమేఘ ఛాయతో వున్న నీ సుందర శరీరం నుండి వచ్చే దయ కరుణ అనే అమృతమును భక్తి అనే పళ్ళెములో వుంచి, సేవ అనే దోసిలితో పట్టుకుని త్రాగుతాను రామభద్రా ..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఖజూరము తేనెలో నంజుకుని తింటే, కలిగే ఆ అనుభవమే వేరు స్థాయిలో వుంటుంది కదా! మామిడి పండు రసాన్ని పెరుగు అన్నములో తింటే, ఆహా! ఎంత హాయో కదా! మరి జుంటి తేనే కంటే, పుష్ప పరాగము కంటే, మామిడి, పనసతొనల కంటే తియ్యనైనది కదా రామనామము. ఈ రామనామము రుచిమరిగిన మనిషి, మనిషి రక్తం రుచిమరిగిన పులి లాగా, వేరొక రుచిని ఇష్ట పడతాడా. రామ రామ రామ అనుకుంటూ జీవన నావను వైతరణి ఆవల తీరాలకు చేర్చుకోవడం కంటే గొప్ప విషయం ఏమున్నది. అలా రామ నామ చుక్కాని సహాయంతో జీవనాన్ని సాగించే బంగారు అవకాశాన్ని కలగజేయమని ఆ సీతాపతిని వేడుకుంటూ.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి