*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 037*
 *ఉత్పలమాల:*
*జుర్రెద మీకథామృతము | జుర్రెద మీపదకంజతోయమున్*
*జుర్రెద రామనామమున | జొబ్బిలుచున్న సుధారసంబు నే*
*జుర్రెద జుర్రుజు్రఁగరు | చుల్ గనువారి పదంబు గూర్పవే*
*తర్రుల తోడి పొత్తిడక | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! నీ కథలనుండి జారుతున్న అమృతమును, నీ పద్మపాదలను తాకి ప్రవహిస్తున్న గంగను, రామానామ స్మరణచేత పుట్టిన అమృతరసమును జుర్రుకుని జుర్రుకుని తాగేవారి సేవ మాకు కలిగించు. అంతేగానీ, నీ నుండీ దూరంగా వుండే వారితో స్నేహాన్ని ఎప్పటికీ కలపకు..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"తాగరా... తాగరా శ్రీరామ నామామృతం! ఆ నామమే దాటించు భవసాగరం!!" ఎంత తియ్యదనమో కదా! ఎంత తాగినా తవి తీరదు కదా! అది సముద్రం అంత. చెంబు తీసుకు వెళితే చెంబుడు. గుండె తీసుకు వెళితే మనసు నిండుగా దొరుకుతుంది. అంతా నాకే తెలుసు, నాదగ్గరే రాముడు వున్నాడు అని అతి మూర్ఖంగా అయినా, నమ్మితే ఆ నమ్మికకి లొంగిపోయి మన దగ్గరే వుంటాడు పరమాత్మ. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న పరాత్పరుడు, పరాశక్తి ఒకటి వుంది అనే నమ్మకంతో మనం వుంటే వైతరణిని దాటిస్తుంది, నామమహిమ. అటువంటి నామ మహిమ నుండి మనల్ని దూరం చేయకుండా, మనల్ని కాపాడుతూ వుండాలని రామేశ్వరుని వేడుకుంటూ .....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు