*ఉత్పలమాల:*
*విన్నప మాలకింపు రఘు | వీర నహి ప్రతి లోకమందు నా*
*కన్న దురాత్ముఁడున్ బరమ | కారుణికోత్తమ! వేల్పులందు నీ*
*కన్న మహాత్ముండున్ బతిత | కల్మషదూరుఁడు లేడు, నాగ వి*
*ద్వన్నుత నీవెనాకు గతి | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! రఘువంశ వీరులలోనే వీరుడవైన రఘురామా! నా విన్నపము విను. ఎన్ని లోకాలలో వెతికినా నా కంటే దుర్మార్గుడు వుండడు. లేడు. దేవతలలో కారుణ్య మూర్తివైన నీ కంటే గొప్ప దేవుడు లేడు, పతితులను ఉద్ధరిచేవాడు, పాపపు కొండలను తొలగించగల వాడు లేడు. పండితులచే ఆరాధింపబడే వాడవైన రామచంద్రా నీవే నాకు దిక్కు........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే! రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః!!" ఈ పద్యాన్ని మన పెద్దలు మన చిన్నతనంలో కంఠస్థం చేయించి మనలో దైవభక్తిని, దేవుడు అనే పరాశక్తి మీద నమ్మకం కలిగించారు. కానీ, ఎదుగుతున్నాము అనే మాయలో పడి మనం ఆ నమ్మకాన్నే నమ్మకంగా ప్రశ్నించే పరిస్థితికి వచ్చాము. దీన్ని అదృష్టం అనుకోవాలో, తెలియనితనం అనుకోవాలో. ఏదైనా, పరమాత్మ స్మరణకు దూరం చేసేది మనకు మంచి చేయదు. ఇది నిక్కము. ముమ్మాటికీ నిజము. ఎందుకంటే, మనల్ని మెలకువలోనూ, నిద్రలోనూ నడిపించేది పరమేశ్వరుడే కదా! మెలకువగా లేదా నిద్రలో వున్నాము అనే మాయ నుండి మనలను బయటకు తీసి తనవైపు నడిపించగలిగిన ఆ రామానామాన్ని నమ్మికగా నమ్మి ముందుకు కదిలే అవకాశం మనకు ఇమ్మని పరాత్పరుడిని వేడుకుందాము........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి