*ఉత్పలమాల:*
*కుక్షిన జాండపంక్తులొన | గూర్చి చరాచరజంతుకోటి సం*
*రక్షణ సేయు తండ్రివి ప | రంపర నీతనయుండనైన నా*
*పక్షము నీవు గావలదె | పాపము లెన్నియొనర్చినన్, జగ*
*ద్రక్షక కర్త వీవె కద | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! నీ బొజ్జలో వరుసలు వరుసలుగా ప్రాణము వున్నవి, లేనివి అన్ని జీవులను రక్షించే తండ్రివి నీవే కదా కరుణామయ రామా! నేను లెక్కలేనన్ని పాపములను చేసినా నీ బిడ్డనేకదా! నా వైపు నిలబడి నన్ను కాపాడవలసినది నీవేకదా! జగత్తును అంతా రక్షించేవాడిని అనే దీక్షలో ఎప్పుడూ వుండే దీక్షా దక్షుడవైన రామభద్రా!........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"రామా కనవేమిరా....! శ్రీ రఘురామ కనవేమిరా....!" అని ఎలుగెత్తి, ఆర్తితో పిలిస్తే, "ప్రక్కల నిలబడి, కొలిచే... ముచ్చట బాగ తెల్పగ రాదా!" అని త్యాగరాజు గారు పాడితే, ప్రత్యక్షంగా వచ్చి దర్శనం ఇచ్చి ధన్యుడను చేశారు, రామచంద్రుడు. రామభధ్ర రఘువీర, రామచంద్ర రణధీర అని తలుపులో నిలుపుకుంటే, మన తల రాతనే మార్చగల నామము "రామ". కరకు బోయవానిని కావ్యకర్తను చేసి మోక్షము ఇచ్చింది. అందుకే, మనమందరం, " శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే!!" అని మనసులో, తలపులో నింపుకుని రామ భజన నిరంతరం చేసుకుని, మన జీవన నౌకను వైతరణి నదిని దాటించుకుందాము, రామనామ వైభవంతో......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి