అనుకున్న ప్రకారం వారి అనుమతితో నేను యోగానంద్ తో వారి ఆఫీస్ కి వెళ్ళాం. వారు సాదరంగ ఆహ్వానించారు. వారితో పని చేస్తున్న ఉద్యోగులనందరినీ పేరుపేరునా వారి విశేషాలతో పరిచయం చేశారు. మర్యాదలన్నీ పూర్తయిన తర్వాత సార్ నిన్న మీ ఉపన్యాసం విన్నాను. ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు ఉన్న గొప్ప గొప్ప వారి ప్రసంగాలను నేను సంభాషణ రూపంలో వినిపిస్తూ ఉంటాను. వచ్చే వారందరూ కూడా ఆకాశవాణి నియమానుసారం కాగితం మీద వ్రాసుకుని రావాలి వారు రాసింది వారు చెప్పడం పెద్ద విశేషం కాదు వారికి నల్లేరు మీద బండి నడిచినట్లే కానీ మీరు ఏ కాగితం పుస్తకం ఆధారం లేకుండా ఆశువుగా దాదాపు గంటన్నర సేపు ఒకే విషయాన్ని గురించి మాట్లాడడం, తడబాటు లేకుండా అక్షర దోషాలు లేకుండా చెప్పడం, నాకు చాలా బాగా నచ్చిన అంశం. అందుకే మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను. దానికి మా యోగి సహకారం ఉంది అనగానే మీ కన్నా ముందే నేను అనుకున్నాను యోగానంద రెడ్డి గారి పరిచయం అయిన తర్వాత మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మీకు జరిగినవే ఉన్నాయి. కనుక ఇద్దరం ఒకే బాటలో పయనిస్తున్నాం అనిపిస్తుంది నాకు. అందుకే ఇంత త్వరగా మనం కలవడం జరిగింది. దానికి మనిద్దరం యోగానందకి అభినందనలు తెలియజేయాలి అని చాలా విషయాలు మాట్లాడుతున్న తర్వాత వారి దగ్గర సెలవు తీసుకుని వచ్చాము వచ్చేటప్పుడు మళ్లీ నా ఆలోచనలు గతంలోకి పయనించాయి నేను ఆకాశవాణిలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విధి నిర్వహిస్తూనే అనేకమంది మేధావులతో చక్కటి సన్నిహిత సంబంధాలను కలగ జేసుకున్నాను. ఉషశ్రీ గారి ద్వారా విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆత్మీయంగా చొరవగా మాట్లాడే స్థితికి వచ్చాను. వేలూరి శివరామ శాస్త్రి గారి గురించి చెప్పవలసి వస్తే వారు మా నాన్నగారికి చాలా సన్నిహితులు. మా గ్రామానికి దగ్గరలోని గ్రామం సిరివాడ. ఆ గ్రామంలో ఆడపిల్లలను చదివించిన మొదటి వ్యక్తి వారే. వారి నలుగురు ఆడపిల్లలు మా హైస్కూల్లో చదివారు ఎద్దుల బండిలో వచ్చి మా ఇంట్లో క్యారియర్లు పెట్టి అమ్మ సమక్షంలో భోజనం చేసి మా ఇంటి ఆడపడుచుల లాగానే ప్రవర్తించారు. వారి అన్న విద్యానంద్ నా సహాధ్యాయి. అలా వారితో నాకు పరిచయం
దాశరథి గారు సినీ ప్రపంచంలో పరిచయం వారు పాటలు ఎలా రాస్తారు దాని పద్ధతి ఏమిటి అన్న విషయాలను వారి దగ్గర నేర్చుకున్నాను. శ్రీ శ్రీ హనుమాన్ జంక్షన్ లో జరిగిన బహిరంగ సభకు మా నాన్నగారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు నుంచి వారి రాకపోకలు జరుగుతున్నాయి. మద్రాసులో కానీ బయటి కానీ దాదాపు వంద సార్లు వారిని కలిశాను వారు ఆకాశవాణికి కవితా పఠనానికి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు నేను సుమన్ దగ్గర ఉండి చూసుకునేవాళ్ళం. సినారె (డాక్టర్ సి.నారాయణరెడ్డి) గారికి నేను శిష్యుణ్ణి ఉండాలి ఎప్పుడూ ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉండేవి. వారు చెబుతూ ఉంటే వారి కుమార్తె సరస్వతి వ్రాసి పంపేది. గోరా గారు (గోపరాజు రామచంద్రరావు) నా వివాహం చేసిన వారు ఆదర్శ పురుషుడు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి వారి వియ్యంకుడు జాషువా.
పల్నాటి యుద్ధం జరుగుతున్న రోజుల్లో నేనూ డాక్టర్ కె వెంకట రాజు గారు జాషువా గారి తో పది రోజులు ఒకే గదిలో ఉన్నాము. వారు చెప్పిన పద్యాలను వ్రాయడం నా అదృష్టం. ఆ పది రోజుల్లో వారి జీవిత ఘట్టాలు ఆనందాన్ని సుఖాన్ని ఎలా అనుభవించారో అవన్నీ వివరించారు. ఇక సంగీత రంగానికి వస్తే బాలమురళీకృష్ణ ఓలేటి, కృష్ణమూర్తి లాంటి వారు నాకు సన్నిహిత మిత్రులు ఇప్పుడు నేను స్నేహం కలుపుకోవాలని కుతూహల పడుతున్న శివ నాగ రెడ్డి గారు ప్రధముడు అనుకున్నది సాధించేవరకు నిద్రపోని వ్యక్తి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత ఎదిగిన వాడు శిల్పాలను చెక్కడంలో, రాతి మీద ఉన్న శాసనాలను చదవటంలో దిట్ట వారికి వారే సాటి వారికి నేను మిత్రుణ్ణి అని చెప్పుకోవడం నాకు గర్వకారణం.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (2);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి