👌ఏక దంతుడు, హరుడు
ఏకైక నాయకుడు!
ఆరాధ్య దైవమ్ము!
ఆత్మ బంధువులార!(1)
ఏక వింశతి పత్రి,
పూలతో భక్తితో
పూజించాలి మనము!
ఆత్మ బంధువులార! (2)
👌శ్రీమహాగణాధిపతి స్వామివారు.. దేవతలందరిలో ప్రప్రధమముగా పూజలందు కొనుచున్నాడు! కనుక, "ఆది పూజ్యుడు".. గణాధిపుడు!
వినాయకుడు.. విజయ దాయకుడు, విఘ్న నాశకుడు!
👌ఏకదంతు డైన వినాయకుని పూజ కోసం మనమంతా సమకూర్చవలసిన పత్రములు (ఆకులు ) అవి..
(1) మాచి పత్రి, (2) వాకుడు ఆకులు, (3) మారేడు ఆకులు, (4) గరికె గడ్డి, (5) ఉమ్మేత్త ఆకులు, (6) రేగు ఆకులు, (7) ఉత్తరేణి ఆకులు, (8) తులసి ఆకులు, (9) మామిడి ఆకులు, (10) గన్నేరు ఆకులు, (11) విష్ణు క్రాంతం ఆకులు, (12) దానిమ్మ ఆకులు, (13) దేవదారు ఆకులు, (14) మరువము ఆకులు, (15) వావిలాకులు. (16) జాజి ఆకులు. (17) దేవ కాంచన ఆకులు,(18) జమ్మి ఆకులు, (19) రావి ఆకులు, (20) మద్ది ఆకులు, (21) జిల్లేడు ఆకులు... మున్నగు నవి; "ఏకవింశతి పత్రములు"!
అవి.. ఏకదంతు డైన శ్రీ మహా గణాధిపతి స్వామి వారికి.. పూజార్హ మైనవి! మిక్కిలి ఔషధీగుణ యుక్తమైన ఆకులు! ఆయుర్వేద శాస్త్రంలో.. విశేష ప్రాధాన్యం కలిగి యున్న పత్రములు!
🚩సీస పద్యము🚩
🙏సుముఖ! "మాచీపత్రము" మదిని గొనుమయ్య,
"బృహతిని" గణనాథ మహిత! కొనుమ!
"బిల్వము" గొనుమయ్య ప్రీతి నుమాపుత్ర!
గజముఖ! గొనుమయ్య "గరిక" నీవు!
హరసూన! "దుత్తూర" మందుకొనుము కృపన్
"బదరి" లంబోదరా! మదిని గొనుమ!
యొప్పు "నపామార్గ" మో గుహాగ్రజ కొను,
గజకర్ణ! "తులసి" ని ఘనతఁ గొనుమ!
ఏకదంతా! కొను మిదె "చూత పత్రంబు,"
వికటా! కొనుము "కరవీర" మిదిగొ!
భిన్నదంతా! కొను ప్రీతి "విష్ణుక్రాంత
మున్", వట! "దాడిమిన్" ముదము గొనుము!
"దేవదారున్" గొను దివ్య సర్వేశ్వరా!
ఫాలచంద్రా! "మరువంబు" గొనుమ!
యీ "సింధు వారమున్" హేరంబ! కొనుమయ్య,
శూర్పకర్ణా! "జాజి" శుభద! కొనుము!
అల "గండకి" గొను సురాగ్రజా! యిభవక్త్ర!
కొనుము "శమీ" పత్రము నయమలర!
"అశ్వత్థ" మిదె కొను మరసి వినాయకా!
సురసేవి "తార్జున" మరసి కొనుము!
🚩తేట గీతి
🙏కపిల! కొను "మర్కపత్రంబు" కరుణ తోడ!
"ఏక వింశతి పత్రంబు లిటులఁ గొనిన
శ్రీగణేశా! శుభాకరా! చిత్తమలర
చెంగుచెంగున గెంతుచు, చెలగు మిచట.
( రచన: శ్రీ చింతా రామకృష్ణారావు.,)
ఏక దంతునకు.. ఏకవింశతి (21) పత్రి పూజ! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి