శివనాగిరెడ్డి కి ఆ పేరు పెట్టినందుకు వారి తల్లిదండ్రులను అభినందించాలి. ఆయన సార్థక నామధేయుడు శివుడు అసామాన్యుడు బ్రహ్మ జన్మనిచ్చి, విష్ణువు అతనిని పెంచి తన చేతిలో పెడితే లయబద్ధంగా అంటే ప్రణాళికాబద్ధంగా పెంచిన వాడు శివుడు ముగ్గురూ కలిసి చేయవలసిన పని ఒకరే చేశారు. తరువాత నాగం అంటే పాము, అది విష జంతువు మానవులకు శత్రువు వారిని చూడగానే కాటువేసి చంపుతుంది అని మన పెద్ద వాళ్ళు చెబుతారు కానీ ఇక్కడ మన శరీరంలో వున్న వెన్నుపాము శరీరాన్ని నిలబెట్టేది, అది ఆలోచనలను రేకెత్తించేది. అది 16108 ఆలోచనలను చెప్పగలదు. దానిని ఎన్నిక చేసి చిన్న మెదడు, పెద్ద మెదడుకు ధర్మబద్ధంగా పంపితే ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో తెలిసి ప్రయాణం చేయడం జీవితం. దానికి తోడు రెడ్డి ఈ పేరు చెప్పగానే ఏదో ఒక కులం కొన్ని గోత్రాలకు పరిమితం అని చెప్పే వారు లేకపోలేదు. రెడ్డి అంటే రాజసప్రధానం కంటికి కనిపించే ఏ వస్తువునైనా రెడ్డి అనవచ్చు. సాత్వికము అంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ. పదార్థం ఉంది కానీ అది ఎలా ఉందో, ఎదురు తిరుగుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కన్న తల్లికి కూడా తెలియదు. 9 నెలలు గడిచిన తర్వాత అది భూమి మీద పడ్డ మరుక్షణం రెడ్డి పేరుతో పిలువబడుచున్నది రాజసం పెరిగి పెద్ద వాడైతే తామస గుణాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ పేరు పెట్టిన తల్లి తండ్రులు ఇంత ఆలోచించక పోయినా తన బిడ్డ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకున్నవారే. వారి ఊహలను రెడ్డి గారు తన జీవితంలో నిజం చేశారు. చిన్నతనం నుంచి కృషి పట్టుదలతో విద్యార్థి దశలో మంచి మార్కులతో సత్ప్రవర్తనతో తనకు తన కుటుంబానికి తన గ్రామానికి పేరు తెచ్చిన వాడే. అలాంటి వాడితో మైత్రి కలవడం అనేక విషయాలను తెలుసుకోవడానికి దోహదపడింది. వారికి బీజం వేసింది ఎవరో తెలియదు కానీ ప్రపంచానికి ఆనందమయ జీవితానికి కావలసిన సూత్రాలను తెలియజేసిన బుద్ధుని బోధలు ఆయనకు శిరోధార్యం. వారు చెప్పిన నాలుగు మార్గాలు, 8 పద్ధతులు బుద్ధుడు అనుసరించాడో లేదో మనకు తెలియదు కానీ రెడ్డి గారు నిజ జీవితంలో చేసి చూపించారు, చూపిస్తున్నారు కూడా. ముందు కోరికలను పెంచుకుంటే జీవితమంతా కష్టాల మయం అదే తెంచుకుంటే ఆనందమయ జీవితం.
భగవాన్ బుద్ధ- భగవంతుడు ఉన్నాడు అని కానీ తాను చూశానని కానీ ఎక్కడా చెప్పలేదు. అలాగే శంకరాచార్యులవారు భగవంతుని ప్రసక్తే లేదు అన్నాడు. జీవి తనువుతో కలిస్తే జీవితం అదే అద్వైతం దాన్ని ప్రచారం చేశాడు తప్ప వేరే తత్వాన్ని ప్రోత్సహించలేదు ఒకరోజు మాట్లాడే సందర్భంలో రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను వెలుగు చూపే వాడు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చే వాడు దేవుడు అన్నాను.
(సశేషం....)
భగవాన్ బుద్ధ- భగవంతుడు ఉన్నాడు అని కానీ తాను చూశానని కానీ ఎక్కడా చెప్పలేదు. అలాగే శంకరాచార్యులవారు భగవంతుని ప్రసక్తే లేదు అన్నాడు. జీవి తనువుతో కలిస్తే జీవితం అదే అద్వైతం దాన్ని ప్రచారం చేశాడు తప్ప వేరే తత్వాన్ని ప్రోత్సహించలేదు ఒకరోజు మాట్లాడే సందర్భంలో రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను వెలుగు చూపే వాడు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చే వాడు దేవుడు అన్నాను.
(సశేషం....)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి