గొప్ప స్థపతి మా శివనాగి రెడ్డి (4);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 భగవంతునిలో భగము అంటే వెలుగు చూపే మార్గం. తల్లి గర్భంలో ఉన్న సాత్వికాన్ని తన భగము ద్వారా ఈ ప్రపంచానికి అందిస్తోంది అమ్మ. దివ్ అంటే జ్ఞానం, దానిని ఇచ్చేవాడు దేవుడు వీరిద్దరూ కూడా నీవే కదా నిన్ను నీవు తెలుసుకొని చేరవలసిన మార్గానికి చేరు. అహం బ్రహ్మాస్మి  నేనే  బ్రహ్మస్వరూపాన్ని అన్న విషయాన్ని మర్చిపోయి  చర్చలకు దిగవలసిన అవసరం ఉందా? అన్నది నా ప్రశ్న. రెడ్డిగారు చాలా ఆనందించి అభినందించారు అది వారి   తత్త్వం "బాలా దపి, శుకా దపి.... వృద్ధా దపి శుకా దపి"
బాలుడు చెప్పినా, చిలుక చెప్పినా అనుసరించ వలసినది అయితే వినాలి. ముసలివాడు చెప్పినా సాక్ష్యాత్తు శుక మహర్షి చెప్పినా
అనుసరించ కూడనిది అయితే వినకు అన్నది రెడ్డి గారు అనుసరించే పద్దతి. శివ నాగి రెడ్డి గారు వారి ఆఫీసులో  ప్రతి నెల రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సాహిత్య కార్యక్రమాలన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా వారికి ఇష్టం  ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పిలుస్తారు. ప్రత్యేకించి నన్ను వక్తగా ఆహ్వానిస్తాడు. వారి మనసులో నాకు ప్రత్యేకమైన స్థానం. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఆ రెండు రోజులు తప్పకుండా అక్కడ ఉంటాను. ఒకరోజు జానపద సాహిత్యాన్ని గురించి చర్చ  ఏర్పాటు చేశారు. రెడ్డిగారికి ఉన్నవారంతా సాహితీమిత్రులు మంచి వక్తలు భాష మీద పట్టు వున్న వారు.  పదంలో ప్రతి అక్షరానికి  అర్థం చెప్ప గలిగిన మేధావులే  ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. మాట్లాడిన వారిలో ముగ్గురు  జానపదం అంటే పనీ పాటా లేని వాళ్ళు పాడే పాటలు పిచ్చి పాటలు అన్న దృష్టిలో  కొంచెం హేళన చేసి మాట్లాడటం నాకు బాధ అనిపించింది. మధ్య మధ్యలో నన్ను రెడ్డి గారు పరిశీలనగా చూస్తున్నారు. వారు మాట్లాడిన తరువాత ఆ కార్యక్రమానికి కంపీర్ గా ఉన్న రెడ్డి గారు నేను ఆనంద్ గారిని చూస్తున్నాను. వీరు మాట్లాడిన మాటలు వారిని భాదించినట్లుగా ఉన్నాయి.  వారి ముఖకవళికల వల్ల  నాకు అవగాహన అయింది కనుక వారి అసంతృప్తిని  వ్యక్తం చేయమని కోరుతున్నాను అని నన్ను ఆహ్వానించారు. జానపద గీతాలు ప్రత్యేకించి ఎవరు రాసినవి కావు తమ కష్టాన్ని మర్చిపోవడానికి కార్మికులు, కర్షకులు ఆలపించేవి. దానికి పల్లెల్లో వారు మాట్లాడుతున్న  జన భాషను ఉపయోగించేవారు అసలు ఇది జానపదం కాదు జ్ఞానపథం అంటే జ్ఞానాన్ని ప్రసాదించే మార్గము అని అర్థం. దీనిలో అశ్లీలం,  ద్వంద్వార్ధాలు కనిపిస్తాయి తప్ప  సరిగా ఆలోచిస్తే వేదాంత అర్థం అద్భుతంగా కనిపిస్తుంది.  సంగీతానికి రాగం, తానం, పల్లవి ఎలా ఉంటాయో దీనికీ అలాగే ఉంటాయి. పాటల్లో కాని, నృత్యాల్లో కానీ  అర్థవంతంగా లేని పదాన్ని వాడరు  జాన పదం - బెత్తి, జానా, మూర లాంటివి కొలతలు  సంగీతంలో ఆది  ఖరహరప్రియ సావేరి రాగం లాగా  ఇది ఒక రకమైన కొలత  జనం కోసం, జనం పాడే పాట  కనుక దీనిని చులకన చేయడానికి వీలులేదు  హిందుస్థానీ కర్ణాటక  సంగీతాలు కానీ  కూచిపూడి లాంటి నృత్యాలు కానీ  జానపదాల నుంచి పుట్టినవే. అనేకమంది జానపదాల గురించి  అనేక  విశ్లేషణలతో  వ్యాసాలు రాశారు. ప్రొఫెసర్ ఎస్ వి జోగా రావు గారు  దానిని గురించిన  పరిశోధనా గ్రంథాన్ని కూడా వెలువరించారు అని చెప్పాను.

కామెంట్‌లు